• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ చరణ్ 17 - రంగంలోకి...

రామ్ చరణ్ 17 - రంగంలోకి టాలెంటెడ్ హీరోయిన్?

| ఇదిలా ఉంటే ‘RC 17’ మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర ప్రచారం తెరపైకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-11-23 08:01 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి రేసులో రిలీజ్ కాబోతోంది. ఇక ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘RC 16’ మూవీని కూడా వీలైనంత వేగంగా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. పీరియాడికల్ జోనర్ లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పైన ఎక్కువ పాజిటివ్ వైబ్ ఉంది.

విలేజ్ నేటివిటీ ఉన్న కథలకి ఇప్పుడు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘RC 16’ కూడా వండర్స్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో జతకట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా అయిపొయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే పనిలో సుకుమార్ ఉన్నారు. దీని తర్వాత కొంత గ్యాప్ తీసుకొకుని ‘RC 17’ మూవీ స్క్రిప్ట్ పైన వర్క్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే కథ రెడీ అయిన బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కావడానికి చాలా సమయం పట్టొచ్చు. సుకుమార్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి స్క్రిప్ట్ వర్క్ చేస్తాడు. స్క్రిప్ట్ డెవలప్మెంట్ నుంచి మూవీ రిలీజ్ వరకు ప్రతిదాన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం సుకుమార్ స్టైల్. ఇదిలా ఉంటే ‘RC 17’ మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని అనుకుంటున్నారంట.

సుకుమార్ హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా బలంగా డిజైన్ చేస్తారు. అందుకే ఈ సారి ‘RC 17’ కోసం సాయి పల్లవి అయితే బెస్ట్ ఛాయస్ అని అనుకుంటున్నారని టాక్. ప్రస్తుతం ఆమె తో చర్చలు జరుగుతున్నాయంట. కథ నచ్చితేనే సాయి పల్లవి మూవీకి ఒకే చెబుతుంది. అందుకే ఆమె స్టార్ హీరోలతో మూవీస్ చేయకుండా క్రేజీ హీరోయిన్ గా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. ‘రంగస్థలం’లో సమంత క్యారెక్టర్ ని సుకుమార్ చాలా బలంగా డిజైన్ చేశాడు.

అలాగే ‘పుష్ప’లో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ‘RC 17’లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ ని బెస్ట్ గా సుకుమార్ డిజైన్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు. అందుకే సాయి పల్లవిని సంప్రదించి ఉంటారనే మాట వినిపిస్తోంది. ఒక వేళ సాయి పల్లవి, రామ్ చరణ్ కాంబినేషన్ ఒకే అయితే మాత్రం కచ్చితంగా ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో ‘తండేల్’ మూవీ చేస్తోంది. అలాగే హిందీలో అమీర్ ఖాన్ తనయుడితో ఒక మూవీ చేస్తోంది. దాంతో పాటు రణబీర్ కపూర్ తో ‘రామాయణం’లో నటిస్తోంది. మరి అమ్మడు రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    
  • Sukumar 
  • Ramcharan 
  • RC17 
  • Pushpa2 
  • Rc16 
  • Buchibabusana 
  • Saipallavi 
  • Gamechanger 
  • Tollywood 
  • Filmindustry 
  • Panindia 
  • Pushpa2movie 
  • Rashmika 

Similar News

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS