మెగా హీరో మెగా ఫిట్నెస్.. స్టన్నింగ్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తరువాత సర్ ప్రైజ్ ఇచ్చాడు. కొత్త సినిమా ‘సంబరాల ఏటి గట్టు’ కోసం చేసిన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.;
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తరువాత సర్ ప్రైజ్ ఇచ్చాడు. కొత్త సినిమా ‘సంబరాల ఏటి గట్టు’ కోసం చేసిన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రెండు భారీ విజయాలు సాధించిన సాయి, ఇప్పుడు తన 18వ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం సెట్ చేసుకున్న ఫిట్నెస్ అభిమానులను ఆకర్షిస్తోంది.
‘సంబరాల ఏటి గట్టు’ సినిమా రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న హై-ఆక్టేన్ పీరియడ్ యాక్షన్ డ్రామా. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ రూపొందిస్తున్న ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. గత డిసెంబర్‌లో రిలీజైన ‘SYG కార్నేజ్’ వీడియోలో సాయి పవర్ఫుల్ లుక్‌లో, చుట్టూ పడిపోయిన శవాల నడుమ ఒక వారియర్‌లా కనిపించాడు. ఈ వీడియోలో ఆయన ఫిజిక్, రగ్డ్ లుక్ అభిమానులను ఫిదా చేసింది.
సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కోసం రోజూ గంటల తరబడి వర్కవుట్ చేసి, స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అయ్యాడని సమాచారం. రాయలసీమ స్లాంగ్‌తో డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్‌లలో పవర్‌ఫుల్ ప్రెజెన్స్ సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా కోసం నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారని టాక్. ఈ సినిమా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఈ సినిమాలో సాయి సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు, వెట్రివేల్ పళనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సినిమా టీజర్‌లోనే భారీ విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఆకర్షించాయి.
సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కోసం చేసిన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, ఈ లుక్‌తో బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయం అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత కొంత విరామం తీసుకున్న సాయి, ఈ సినిమాతో బలంగా తిరిగి రావడానికి సిద్ధమయ్యాడు. మొత్తంగా, ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాతో సాయి ధరమ్ తేజ్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.