రిలీజ్‌కు ముందే 'దృశ్యం 3' రికార్డుల మోత!
నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌కు భారీ మొత్తం దక్కింది. ఈ ఏరియా హక్కుల్ని రూ.10 కోట్లకు విక్రయించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.;
దేశ వ్యాప్తంగా సినీ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుని థ్రిల్ చేసిన సీక్వెల్లలో మలయాళ థ్రిల్లర్ `దృశ్యం` ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు మంచి ఆదరణ సొంతం చేసుకుని ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి థర్డ్ ఇనిస్టాల్‌మెంట్‌గా రానున్న `దృశ్యం 3`పై పడింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌ని జీతూ జోసెఫ్ రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
హిందీలోనూ ఇదే రీమేక్‌ని అజయ్ దేవ్‌గన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తెలుగులో విక్టరీ వెంకటేష్ ఈ రీమేక్ చేయాల్సింది. అయితే ఈ సీక్వెల్‌లో నటించడం లేదని, ఈ ఫ్రాంచేజికి గుడ్ బై చెప్పేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేఫథ్యంలో మలయాళంలో రూపొందుతున్న థ్రిల్లర్ `దృశ్యం3`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ 2న భారీ స్థాయిలో దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభించిన మేకర్స్ చక్ చక పూర్తి చేస్తున్నారు.
ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ ప్రారంభించిన మేకర్స్ ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ పరంగా రికార్డులు సృష్టిస్తున్నారు. `దృశ్యం 2` కోలీవడ్ పరిణామాల కారణంగా థియేట్రికల్ రిలీజ్‌కు నోచుకోలేదు. కేవలం ఓటీటీ ప్లాట్ ఫామ్‌కే పరిమితమైంది. అయినా సరే వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో అన్ని భాషలకు చెందిన ప్రేక్షకులకు రీచ్ అయింది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఈ ఫ్రాంచైజీ చిత్రాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఓవర్సీన్‌కు సంబంధించిన నార్త్ అమెరికాలో రికార్డు స్థాయి బిజినెస్ జరిగినట్టుగా తెలిసింది.
నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌కు భారీ మొత్తం దక్కింది. ఈ ఏరియా హక్కుల్ని రూ.10 కోట్లకు విక్రయించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓ మలయాళ మూవీకి నార్త్ అమెరికాలో ఇంత పెద్ద మొత్తంలో థియేట్రికల్ రైట్స్‌కి రావడం రికార్డుగా చెబుతున్నారు. అమెరికా వైడ్‌గా రూ.6 కోట్లు, కెనడా వైడ్‌గా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్‌కు రూ.4 కోట్లు దక్కినట్టుగా తెలిసింది. నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ పరంగా మలయాళ మూవీకి దక్కిన అరుదైన రికార్డ్‌గా తెలుస్తోంది.
ఇక్కడ మోహన్ లాల్ నటించిన `ఎల్ 2 ఎంపురాన్` 2.7 మిలియన్ వసూళ్లని రాబట్టింది. ఈ లెక్కల ప్రకారం `దృశ్యం 3` బ్రేక్ ఈవెన్‌ని సాధించాలంటే ఇంతకు మించి అక్కడ వసూళ్లని రాబట్టాల్ని ఉంటుంది. `ఎల్ 2 ఎంపురాన్` 2.7 మిలియన్ మిక్స్డ్ టాక్‌కే ఆ మాత్రం రాబట్టింది. అదే `దృశ్యం 3`కి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అంతకు మించిన వసూళ్లని రాబడుతుందని, అదేమంత కష్టమేమీ కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రిలీజ్‌కు ముందే అక్కడ రికార్డుల మోత మోగిస్తున్న `దృశ్యం 3` రిలీజ్ తరువాత ఖచ్చితంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.