పిక్‌టాక్‌ : ముందే ఇలా కలిసిన విజయ్‌, రష్మిక

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం గురించి గత కొన్ని నెలలుగా పతాక స్థాయిలో ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.;

Update: 2026-02-26 12:30 GMT

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం గురించి గత కొన్ని నెలలుగా పతాక స్థాయిలో ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి గురించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కనీసం విజయ్ దేవరకొండ పీఆర్‌ టీం లేదా రష్మిక టీం మెంబర్స్ కూడా పెళ్లి ఫోటోలు అధికారికంగా బయటకు విడుదల చేయలేదు. బయటకు లీక్‌ కాకుండా జాగ్రత్త పడ్డారు. పెళ్లి గురించి పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం పై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా కూడా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇంటర్నెట్‌లో ప్రచారం జరిగినట్లుగానే విజయ్‌, రష్మికల వివాహం భారీ ఎత్తున జరిగింది. ఇండస్ట్రీ నుంచి ఈ పెళ్లికి ఎవరు హాజరు అయ్యారు అనే విషయంలోనూ ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.



 


గీతా గోవిందం సినిమాతో ప్రేమలో...

గీతా గోవిందం సినిమాలోని పెళ్లి ఫోటోలు, వీడియోలను తీసుకుని ఇప్పుడు సోషల్‌ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. విజయ్‌, రష్మికల నిజమైన పెళ్లి వీడియోలు, ఫోటోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లి ఫోటోలు, వీడియోలు రాలేదు, కానీ సంక్రాంతి సందర్భంగా తీసుకున్న ఒక ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సంక్రాంతి పండుగను విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి రష్మిక మందన్న జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలో విజయ్‌ దేవరకొండ మదర్‌ పై చేతులు వేసి మరీ రష్మిక మందన్న ఫోటోకు ఫోజ్‌లు ఇచ్చింది. ఆ సమయంలో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. పెళ్లి ఫోటోలు వైరల్‌ కావాల్సిన ఈ సమయంలో ఆ ఫోటోలు లేకపోవడంతో ఈ ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం...

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహంకు సంబంధించిన ఫోటోలు అధికారికంగా బయటకు రాకపోవడంతో అభిమానులు చేసేది లేక ఇంటర్నెట్‌లో ఉన్న ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ తమ అభిమాన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఇప్పటి వరకు ఈ పెళ్లి గురించి స్పందించలేదు. ఇలా ఒక హీరో హీరోయిన్‌ పెళ్లి విషయంలో ఇంతగా సస్పెన్స్ కొనసాగడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. కొందరు ఏఐ ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. విజయ్‌, రష్మికల వివాహం అయినట్లుగా ఏఐ లో ఫోటోలు షేర్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరికొందరు. గీతా గోవిందం సినిమాలోని ఫోటోలు కూడా ఈ సమయంలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది అనే విషయం అందరికీ తెలిసిందే.

సంక్రాంతి సమయంలో తీసుకున్న ఫోటో వైరల్‌...

గీతా గోవిందం మాత్రమే కాకుండా వీరిద్దరి కాంబోలో డియర్‌ కామ్రెడ్‌ సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌గా నిరాశ పరిచింది. అయినా కూడా ఇద్దరి కాంబోకి మంచి క్రేజ్‌ ఉంది. దాంతో మళ్లీ వీరు ఎప్పుడు నటిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కెరీర్‌ పరంగా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎలా పెళ్లి చేసుకుంటున్నారు అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. పెళ్లి అయితే హీరోయిన్స్ కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ రష్మిక టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది కనుక ఎలాంటి ఇబ్బంది ఉండక పోవచ్చు అనేది సమాచారం. విజయ్‌, రష్మికల కాంబోలో రాబోయే రోజుల్లో అయినా సినిమా వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తెగ ట్రెండ్‌ అవుతున్న, పెళ్లికి ముందే వీరు కలిసిన ఈ పాత సంక్రాంతి ఫోటోను మీరు ఒక లుక్కేయండి.

Tags:    

Similar News