రుక్కు.. రుక్కు.. రుక్మిణి.. సోషల్ మీడియా ట్రెండింగ్..!

రుక్మిణి వసంత్ 2019లో బర్బల్ ట్రిలోగి కేస్ 1 సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో అప్ స్టార్స్ లో నటించింది.;

Update: 2025-10-11 11:30 GMT

అదేంటో కన్నడ భామలు ఎవరొచ్చినా సరే పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటారు. మొన్నటిదాకా నేషనల్ క్రష్ గా రష్మిక మందన్న అదరగొట్టేసింది. ఇప్పుడు ఆమె ప్లేస్ లో కొత్తగా మరో కన్నడ భామ రుక్మిణి వసంత్ ని ఇష్టపడుతున్నారు ఆడియన్స్. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే చాలు అందులో రుక్మిణి వసంత్ హైలెటెడ్ టాపిక్ అయ్యింది. ఆమె గురించే రీల్స్, ఆమె గురించే డిస్కషన్స్, ఆమె వీడియోస్ తోనే ట్రెండ్ చేస్తున్నారు.

సప్త సాగరాలు దాటి రెండు భాగాలు..

రుక్మిణి వసంత్ 2019లో బర్బల్ ట్రిలోగి కేస్ 1 సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో అప్ స్టార్స్ లో నటించింది. ఇక నెక్స్ట్ రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి సినిమాలో ఛాన్స్ అందుకుంది. సప్త సాగరాలు దాటి రెండు భాగాలుగా రిలీజైంది. ఈ సినిమాలో ఆమె ప్రియ రోల్ లో నటించి మెప్పించింది. ఆ సినిమాతోనే అమ్మడు సౌత్ ఆడియన్స్ కు రీచ్ అయ్యింది. తెలుగులో కూడా రుక్మిణి సప్త సాగరాలు రెండు భాగాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా రుక్మిణికి మంచి పాపులారిటీ వచ్చేలా చేశాయి.

ఇదే వరుసలో కన్నడలో భగీర, బాణదానియల్లి సినిమాల్లో నటించింది. తెలుగులో సైలెంట్ గా నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది అమ్మడు. ఆ సినిమా తర్వాత ఎన్ టీ ఆర్ తో డ్రాగన్ సినిమా ఛాన్స్ అందుకుంది. ఐతే రీసెంట్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 లో రుక్మిణి అదరగొట్టేసింది. సినిమాలో కనకావతి రోల్ లో రుక్మిణి నెక్స్ట్ లెవెల్ అనిపించింది.

సోషల్ మీడియాలో రుక్కు.. రుక్కు.. రుక్మిణి..

సప్త సాగరాలు దాటి సినిమాతోనే ఆమె యూత్ ఆడియన్స్ కి హాట్ ఫేవరెట్ కాగా ఇక కాంతారా కనకావతి లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది రుక్మిణి. అందుకే కాంతారా చాప్టర్ 1 రిలీజైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో మరో హీరోయిన్ ప్రస్తావన లేకుండా రుక్మిణి వసంత్ ని ట్రెండింగ్ లో ఉంచుతున్నారు. ఇక మీమర్స్ అయితే రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ తో ఆమె వీడియోస్ ని వైరల్ చేస్తున్నారు. రుక్మిణి కనిపిస్తే చాలు అది ఫోటో అయినా వీడియో అయినా లక్షల కొద్దీ వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఈ రుక్కు.. రుక్కు క్రేజ్ చూస్తుంటే సౌత్ కాదు నేషనల్ వైడ్ గా దుమ్ము దులిపేలా ఉంది.

రుక్మిణి వసంత్ ప్రస్తుతం సౌత్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న హీరోయిన్. కాంతారా 1 తో ఆమె క్రేజ్ డబుల్ అయ్యింది. నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ తో కూడా అమ్మడు మరింత క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News