ఎన్టీఆర్ సినిమా కోసం అమ్మడి డిమాండ్..!
సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ పాపులర్ అయిన రుక్మిణి వసంత్ ఇప్పుడు టాలీవుడ్ లో ఫేవరెట్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది.;
సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ పాపులర్ అయిన రుక్మిణి వసంత్ ఇప్పుడు టాలీవుడ్ లో ఫేవరెట్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. మామూలుగానే కన్నడ నుంచి వచ్చిన భామలకు మంచి డిమాండ్ ఉంటుంది. సో సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రుక్మిణి ఇక్కడ వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. ఆల్రెడీ నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసిన రుక్మిణి ఆ సినిమాతో అంత ఇంపాక్ట్ చూపలేకపోయింది. ఆ సినిమా కూడా ఎప్పుడో తీశారన్నట్టుగానే వచ్చింది.
ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో ప్రాజెక్ట్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఈమధ్యనే అమ్మడు షూటింగ్ లో పాల్గొన్నదని తెలుస్తుంది. ఎన్టీఆర్ తో ఛాన్స్ అంటే రుక్మిణికి టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ వచ్చినట్టే లెక్క. ఐతే ఈ సినిమాలో నటించేందుకు గాను అమ్మడు భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది. కన్నడ సినిమాల్లో హీరోయిన్స్ కి అంత ఎక్కువ పారితోషికం ఉండదు. అక్కడ స్టార్ హీరోయిన్స్ కే కోటి కన్నా ఎక్కువ ఇవ్వరు.
రుక్మిణి వసంత్ అయితే ఇప్పటివరకు మేకర్స్ ఇచ్చిన పారితోషికం తీసుకోవడమే కానీ తను డిమాండ్ చేసింది లేదు. ఐతే ఎన్టీఆర్ సినిమాకు మాత్రం అమ్మడు కోటిన్నర దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్. తెలుగు హీరోయిన్స్ అది కూడా కాస్త ఫాం లో ఉన్న హీరోయిన్స్ కి కోటిన్నర ఏంటి 2 కోట్ల నుంచి 3 కోట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఐతే ఈమధ్య స్టార్ హీరోలంతా భారీగా రెమ్యూనరేషన్ పెంచారు కాబట్టి హీరోయిన్స్ కూడా అందుకు తగినట్టుగానే డిమాండ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
కాస్త హిట్ ఫాంలో ఉన్న హీరోయిన్స్ ఐతే 5, 6 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. ఎలాగు తీసేది పాన్ ఇండియా సినిమా కాబట్టు బడ్జెట్ 200, 300 కోట్లు పెడుతున్నప్పుడు హీరోయిన్స్ అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సైతం ఓకే అనేస్తున్నారు. రుక్మిణి వసంత్ మాత్రం తెలుగులో ఎన్టీఆర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. మరి ఈ సినిమా అమ్మడికి ఏ రేంజ్ క్రేజ్ తెస్తుందో చూడాలి. ఎన్టీఆర్ సినిమా చేస్తుంది కాబట్టి ఆ తర్వాత అమ్మడికి తెలుగులో వరుస స్టార్ ఛాన్స్ లు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు.