తండ్రితో కలిసి 50 స్క్రిప్టులు రిజెక్ట్ చేశాడా? నిజమేనా?
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలో రోషన్ మేకా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలో రోషన్ మేకా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుద్రమదేవి సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఏడాది నిర్మల కాన్వెంట్ తో హీరోగా మారిన యువ నటుడు రోషన్.. బెస్ట్ మేల్ డెబ్యూగా వివిధ అవార్డులు అందుకున్నారు.
కానీ సరైన హిట్ ను సొంతం చేసుకోకపోయినా, గుర్తింపు మాత్రం సంపాదించుకున్నారు. ఆ తర్వాత కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పెళ్లిసందD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు రోషన్. మంచి హిట్ కూడా అందుకున్నారు. తన యాక్టింగ్ తో అలరించారు.
ఆ తర్వాత తన పేరులోని స్పెల్లింగ్‌ను 'Roshann' గా మార్చుకుని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరిన్ని చిత్రాలు లైన్ లో పెట్టేందుకు ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా రోషన్ తన తండ్రితో కలిసి గత సంవత్సరంలో దాదాపు 50 స్క్రిప్ట్ లను తిరస్కరించారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.
శ్రీకాంత్ తన కొడుకు కొత్త చిత్రాల ఎంపికల గురించి చాలా సెలక్టివ్ గా ఉన్నారని తెలుస్తోంది. తదుపరి ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తొందరపడడం లేదని సమాచారం. అన్ని విధాలుగా నచ్చితేనే ఒప్పుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. సరైన హిట్స్ అందుకుని ట్రాక్ లోకి రావాలని రోషన్ గట్టిగా కోరుకుంటున్నట్లు వినికిడి.
ఇక రోషన్ అప్ కమింగ్ మూవీస్ విషయానికొస్తే.. ప్రస్తుతం యంగ్ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఛాంపియన్ అనే సినిమా చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత చిత్ర నిర్మాత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ తో కలిసి స్వప్న దత్ సినిమా నిర్మిస్తున్నారు.
స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఆ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో వేదాంష్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ పై మరో సినిమా చేస్తున్నారు రోషన్. వాటితో పాటు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ లీడ్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా చిత్రం వృషభలో యాక్ట్ చేస్తున్నారు. మరి అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.