స్టూడెంట్ నెం.1 నుంచి ఛాంపియన్ దాకా.. ఎన్టీఆర్ ఎమోషనల్
రోషన్ మేక హీరోగా నటిస్తున్న 'ఛాంపియన్' సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.;
రోషన్ మేక హీరోగా నటిస్తున్న 'ఛాంపియన్' సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. లేటెస్ట్ గా ఆయన ఈ సినిమాకు సంబంధించిన 'సెలిబ్రేషన్ ఆఫ్ ఛాంపియన్' అనే సరికొత్త టీజర్ ను విడుదల చేశారు. ఇంతకుముందు వచ్చిన ట్రైలర్ చాలా సీరియస్ గా, ఎమోషనల్ గా ఉంటే, ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ టీజర్ మాత్రం ఫుల్ ఎనర్జీతో, పండగ వాతావరణాన్ని తలపిస్తోంది.
ఈ కొత్త టీజర్ లో రోషన్ చాలా ఉత్సాహంగా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. "ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్" అంటూ మొదలయ్యే ఈ వీడియోలో విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా "మాజాక్ రా" అంటూ వచ్చే డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ సినిమాలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. హీరోయిన్ అనస్వర రాజన్ తో రోషన్ కెమిస్ట్రీ, ఆ డాన్స్ మూవ్స్ యూత్ ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్వప్న సినిమాస్ బ్యానర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "స్టూడెంట్ నెం.1 నుంచి ఛాంపియన్ వరకు.. స్వప్న, ప్రియాంక దత్ ఎప్పుడూ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు" అని తారక్ కొనియాడారు. సినిమా మీద ప్రేమతో, కొత్తదనం కోసం వారు చేసే ప్రయత్నాలు స్వప్న సినిమాస్ కు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను చేసే ప్రతి పనిలో స్వప్న ఎలాగైతే తనకు అండగా నిలబడ్డారో, తాను కూడా ఆమెకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటానని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. రోషన్, అనస్వర, దర్శకుడు ప్రదీప్ అద్వైతం సహా టీమ్ మొత్తానికి తన బెస్ట్ విషెస్ అందించారు. ఎన్టీఆర్ సపోర్ట్ దొరకడంతో ఛాంపియన్ టీమ్ లో జోష్ రెట్టింపు అయ్యింది.
బైరాన్‌పల్లి గ్రామంలో రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటమే ఈ సినిమా కథాంశం. కానీ ఇందులో యాక్షన్, ఎమోషన్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని లేటెస్ట్ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. 2025 ఇయర్ ఎండింగ్ లో వస్తున్న ఈ సినిమా మెమరబుల్ హిట్ గా నిలుస్తుందని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 25న థియేటర్లలో చాంపియన్ గేమ్ మొదలుకానుంది. ఎన్టీఆర్ చేతుల మీదుగా వచ్చిన ఈ టీజర్ సినిమాపై హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. రోషన్ తన నటనతో, డాన్స్ తో ఆడియెన్స్ ను ఎలా మెప్పిస్తాడో చూడాలి. 'ఛాంపియన్' నిజంగానే బాక్సాఫీస్ ఛాంపియన్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్న గంటల వరకు ఆగాల్సిందే.