• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రూమర్స్ కి చెక్ పెట్టిన...

రూమర్స్ కి చెక్ పెట్టిన రణబీర్ సోదరి.. అందరికీ ఆమోదమే అంటూ క్లారిటీ!

| బాలీవుడ్ ప్రముఖ నటుల జాబితాలో కపూర్ ఫ్యామిలీ కూడా ముందుంటుంది.ఇప్పటికే కపూర్ ఫ్యామిలీ నుండి దిగ్గజ నటులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

By - Madhu Reddy
Update: 2025-08-07 17:30 GMT

బాలీవుడ్ ప్రముఖ నటుల జాబితాలో కపూర్ ఫ్యామిలీ కూడా ముందుంటుంది.ఇప్పటికే కపూర్ ఫ్యామిలీ నుండి దిగ్గజ నటులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అలాంటి వారిలో ప్రస్తుత జనరేషన్లో రణబీర్ కపూర్ ఉన్నారు.. నీతూ కపూర్ , రిషి కపూర్ ల కొడుకే రణబీర్ కపూర్.. అయితే రణబీర్ కపూర్ కి సోదరి రిద్ధిమా కపూర్ కూడా ఉన్నారు. రణబీర్ కపూర్ బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతుంటే రిద్ధిమా కపూర్ మాత్రం ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు. అయితే చాలా రోజుల నుండి కపూర్ ఫ్యామిలీ సినిమాల్లోకి తమ కూతుర్లను హీరోయిన్ గా పంపరు అనే ఒక రూమర్ ఉంది.

అంతేకాదు రిద్ధిమా కపూర్ సినిమాల్లోకి హీరోయిన్ గా వద్దామనుకుంటే రిషి కపూర్ ఆమెకు సినిమాల్లోకి వద్దు అనే కఠినమైన రూల్ పెట్టినట్టు కూడా కొన్ని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించింది రిద్ధిమా కపూర్. ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను సినిమాల్లోకి వస్తే వద్దని నాన్న కండిషన్ పెట్టినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు.అవన్నీ నిరాధారమైన పుకార్లు మాత్రమే. నేను చదువు పూర్తయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్ ని ఎంచుకున్నాను. అందుకే నాకు సినిమాల్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఇన్ని రోజులు కలగలేదు. అంతేకానీ సినిమాల్లోకి వస్తానంటే మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చింది రిద్ధిమా కపూర్.

అయితే రిద్ధిమా కపూర్ ప్రస్తుతం తన 44 ఏళ్ల వయసులో 'దాదీ కీ షాదీ' అనే మూవీతో ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో రిద్ధిమా కపూర్ తల్లి నీతూ కపూర్ కూడా నటిస్తోంది. అలాగే ఇందులో కపిల్ శర్మ కూడా నటిస్తున్నారు. ఇక దాదీ కీ షాదీ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ జానర్లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతున్న రిద్ధిమా కపూర్ తన 44 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వస్తానంటే కుటుంబం మొత్తం సపోర్ట్ చేసిందట. కుటుంబం ఇచ్చిన సపోర్ట్ తో చాలా ఉత్సాహంగా ఈ సినిమాని ఒప్పుకున్నట్టు రిద్ధిమా కపూర్ తెలియ జేసింది. తాను సినిమాల్లోకి రావడానికి తన వదిన అలియా భట్ తో సహా తన కుటుంబం మొత్తం ఎంతో సపోర్ట్ చేసిందని,వారి సపోర్ట్ తోనే తాను సినిమాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నట్టు రిద్ధిమా కపూర్ తెలియజేసింది. ప్రస్తుతం రిద్ధిమా కపూర్ మాట్లాడిన మాటలు బీ టౌన్ లో వైరల్ గా మారాయి.

Tags:    
  • RiddhimaKapoor 
  • KapoorFamily 
  • BollywoodDebut 
  • NeetuKapoor 
  • KapilSharma 
  • రిద్ధిమా కపూర్ 
  • బాలీవుడ్ ఎంట్రీ 
  • కపూర్ ఫ్యామిలీ 
  • నీతూ కపూర్ 
  • అలియా భట్ 
  • Riddhima Kapoor 
  • Bollywood debut 
  • Kapoor family 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS