సంక్రాంతికి బుల్లి రాజు నుంచి రెండు సినిమాలు

రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో చిత్ర ప్ర‌మోష‌న్స్ ను మ‌రింత వేగ‌వంతం చేశారు. అనిల్ రావిపూడి త‌న సినిమాల‌ను ఏ స్థాయిలో ప్ర‌మోట్ చేస్తారో తెలిసిందే.;

Update: 2026-01-10 09:24 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు. న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్ గారు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో చిత్ర ప్ర‌మోష‌న్స్ ను మ‌రింత వేగ‌వంతం చేశారు. అనిల్ రావిపూడి త‌న సినిమాల‌ను ఏ స్థాయిలో ప్ర‌మోట్ చేస్తారో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ భారాన్ని కూడా త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపిస్తున్నారు. ఈ సినిమాకు మొద‌టినుంచి మంచి బ‌జ్ ఉండ‌గా, త‌ర్వాత్తర్వాత సినిమా నుంచి రిలీజైన కంటెంట్ సినిమాపై ఉన్న హైప్ ను ఇంకాస్త పెంచింది.''

గ‌త సంక్రాంతికి బుల్లిరాజుగా..

అయితే ఈ సినిమాలో బుల్లి రాజు న‌టించాడ‌ని మొద‌టినుంచి అంటున్నారు. అయితే టీజ‌ర్‌లో కానీ, ట్రైల‌ర్‌లో కానీ అత‌న్నెక్క‌డా చూపించ‌లేదు. గ‌తేడాది సంక్రాంతికి అనిల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలో రేవంత్ భీమల చేసిన బుల్లిరాజు క్యారెక్ట‌ర్ ఏ స్థాయిలో పేలిందో అంద‌రికీ తెలిసిందే. వెంక‌టేష్ కొడుకు పాత్ర‌లో రేవంత్ చెప్పిన డైలాగ్స్ కు అంద‌రూ క‌డుపుబ్బా న‌వ్వారు.

చిరూ సినిమాలో డిఫ‌రెంట్ పాత్ర‌లో..

దీంతో ఆ సినిమా త‌ర్వాత బుల్లి రాజుగా న‌టించిన రేవంత్ భీమ‌ల క్రేజ్ బాగా పెరిగింది. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే అనిల్ ఈ సినిమాలో కూడా ఆ పిల్లాడితో కొన్ని సీన్స్ ను పెట్టార‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బుల్లి రాజు పాత్ర‌కు పూర్తి భిన్నంగా ఉండే క్యారెక్ట‌ర్ లో రేవంత్ భీమ‌ల క‌నిపిస్తాడ‌ని డైరెక్ట‌ర్ అనిల్ ఇప్ప‌టికే క్లారిటీ ఇవ్వ‌గా, చిరూ- రేవంత్ కాంబోలో తీసిన సీన్స్ చాలా బాగా వ‌చ్చాయ‌ని తెలుస్తోంది.

అన‌గ‌న‌గా ఒక రాజు మూవీలో కూడా..

గ‌తేడాది సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో బుల్లిరాజుగా ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మై ఎంట‌ర్టైన్ చేసిన రేవంత్ భీమ‌ల, ఈసారి మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమాలో అంత లెంగ్తీ రోల్ చేయ‌కపోయినా, సినిమాలో రేవంత్ ఉన్న సీన్స్ కు థియేట‌ర్ల‌లో ఆడియ‌న్స్ బాగా ఎంజాయ్ చేస్తార‌ని చెప్తున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయ‌డంతో స్క్రీన్ పై రేవంత్ క‌నిపించ‌గానే విజిల్స్ ప‌డ‌టం, అరుపులు, కేక‌లు వినిపించ‌డం ఖాయం. అయితే రేవంత్ మెగాస్టార్ మూవీతో పాటూ సంక్రాంతికి రాబోతున్న న‌వీన్ పోలిశెట్టి సినిమా అన‌గ‌న‌గా ఒక రాజు లో కూడా ఓ కీల‌క పాత్ర చేశాడు. మొత్తానికి ఈ సంక్రాంతిక రేవంత్ నుంచి రెండు సినిమాలు వ‌స్తున్నాయ‌న్న‌మాట‌. మ‌రి ఈ రెండింటిలో ఏ సినిమాతో రేవంత్ ఎక్కువ పేరు తెచ్చుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News