అవార్డుల వేళ రాజకీయాలు అవసరమా?
మాలయాళ నటి రీమా కల్లింగల్ కేరళ పిలిం క్రిటిక్స్ అవార్డుకు ఎంపికైంది. 'థియేటర్: దిమిత్ ఆఫ్ రియాల్టీ మూవీలో పాత్రకు గాను ఈ గౌరవం లభించింది.;
మాలయాళ నటి రీమా కల్లింగల్ కేరళ పిలిం క్రిటిక్స్ అవార్డుకు ఎంపికైంది. 'థియేటర్: దిమిత్ ఆఫ్ రియాల్టీ మూవీలో పాత్రకు గాను ఈ గౌరవం లభించింది. సంతోషంగా అవార్డును కూడా అందుకుంది. అయితే సరిగ్గా ఇదే వేదికగా మాలీవుడ్ మీడియా (అమ్మ) మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి ప్రశ్నలు లేవనెత్తడం మొదలు పెట్టింది. అసోసియేషన్ లో నాయకత్వ మార్పుపై మాట్లాడాలని అడిగారు. కానీ వాటిని మాట్లాడటానికి రీమా ఎంత మాత్రం ఇష్టపడలేదు. సంతోషంగా అవార్డు అందుకున్న వేళ అమ్మ రాజకీయాలు మనకెందుకంటూ తప్పించుకున్నారు.
ఇది సరైన ప్రశ్నగా తాను భావించినట్లు అసంతృప్తిని వ్యక్తం చేసారు. అమ్మలో మహిళల ప్రాధాన్యత పెరిగాలని కోరారు. కానీ ఈ వేదికపై ఇలాంటి ప్రశ్నలు వేయడం తనని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. దీనికి సంబంధించి మరో వేదిక ఏర్పాటు చేసుకుని మాట్లాడుకుందామని మీడియాని కూల్ చేసింది. సినిమా తన నటనకు మాత్రమే అవార్డు వచ్చింది..కానీ ఆ సినిమాలో పాత్రకు బదులు రాజకీ యాలని టచ్ చేస్తున్నారని కాస్త అసహనాన్ని వ్యక్తం చేసారు. ఇటీవలే అమ్మ అధ్యక్ష పదవికి శ్వేతామీనన్ ఎన్నికైన సంగతి తెలిసిందే.
ప్రత్యర్ది ప్యానల్ పై శ్వేతా మీనన్ ప్యానెల్ గెలుపొందింది. దీంతో అందులో కీలక పదవులకు గెలిచిన వారంతా నియమితులయ్యారు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే శ్వేతా మీనన్ పై పోలీసు కేసుల అంశం కూడా తెరపైకి వచ్చింది. కావాలనే ఆమెను ఓ పాత కేసులో ఇరించాలనే కొన్ని ప్రయత్నాలు చేసనట్లు మీడియాలో వైరల్ అయింది. ఎన్నికల్లో ఆమెను పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటించాలనే కుట్ర జరిగిందనే వార్తలు వచ్చాయి. అయినా వాటన్నింటిని ఎదుర్కుని అధ్యక్ష పీఠంపైకి మెరుపులా దూసు కెళ్లింది.
అమ్మ పాత కార్యవర్గం లైంగిక ఆరోపణలు కారణంగా ఎవరికి వారు స్వచ్ఛందంగా రాజీనామాలు ప్రకటించి న సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది సంచలనగా మారింది. మాలీవుడ్ పరిశ్రమలో ఈస్థాయిలో లైంగిక వేధింపులున్నాయా? అంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఎవరి పేరు ఎలా బయటకొస్తుందా? టెన్షన్ వాతావరణం నెలకొంది. జస్టిస్ మహే కమిటీ నివేదిక దేశ వ్యాప్తంగా సంచలనమవ్వడంతో మిగతా పరిశ్రమలు కూడా అలెర్ట్ అయిన సంగతి తెలిసిందే.