రాజాకి సెంటిమెంట్ ప్లస్ సేఫ్ జోన్!
మాస్ మహారాజా రవితేజ కొంత కాలంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరమైన సంగతి తెలిసిందే.;
మాస్ మహారాజా రవితేజ కొంత కాలంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరమైన సంగతి తెలిసిందే. తన మార్క్ మాస్ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. వాటి ఫలితాలు తీవ్ర నిరాశ పరుస్తున్నాయి. నిర్మాతలు, సినిమాను కొన్న వాళ్లు తీవ్ర నష్టాల్లో మునిగిపోతున్నారు. దీంతో రాజా మార్కెట్ డౌన్ అవుతుంది. ప్లాప్ ను రవితేజ సీరియస్ గా తీసుకోకపోయినా? నష్టపోయిన వాళ్లు మాత్రం సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఇదే కొనసాగితే మార్కెట్ పై ప్రభావం తప్పదు. ఇలాంటి పరిస్థితులున్నా? రవితేజ జోరు కూడా ఎంత మాత్రం తగ్గదు అన్నది అంతే వాస్తవం.
క్లాసిక్ చిత్రాల దర్శకుడు:
కొత్త కొత్త ప్రాజెక్ట్ లతో జోరు చూపిస్తూనే ఉంటాడు. తాజాగా ఈ ఏడాది `సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి` అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కిషోర్ తిరుమల సినిమాలంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా క్లాసిక్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. అందులోనూ అతడి కథలు రోటీన్ గా ఉండవు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటాయి. భర్త మహాశయులు విషయంలో కూడా కొత్త దనం ఉంటుందని ప్రేక్షకాభిమానులు ఆశీస్తున్నారు.
ఫ్యామిలీ స్టోరీలతో సక్సెస్:
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ కూడా ఏర్పడింది. ఆ క్రేజ్ కి ఇప్పుడు రవితేజ సక్సెస్ సెంటిమెంట్ కూడా తోడవుతుంది. గతంలో రవితేజ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎమోషన్ స్టోరీలన్నీ మంచి విజయం సాధించినవే. `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, ` ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు`, `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి` , `వెంకీ`, `నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్`, లాంటి చిత్రాలు అప్పట్లో ఎలాంటి విజయాలు సాధించాయో తెలిసిందే. రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్లు ఇవన్నీ. కుటుంబ అనుబంధాలకు లవ్ ను జోడించి తెరకెక్కించిన చిత్రాలు.
సెంటిమెంట్ కలిసొచ్చేనా:
అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం ఒక ఎత్తైతే? ప్రత్యేకించి ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం మరో ఎత్తు లా నిలిచాయి. అలాగే `కిక్`, `రాజా దిగ్రేట్` లాంటి సినిమాలు కూడా చక్కని విజయాలు అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఆసక్సెస్ సెంటిమెంట్ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` విషయంలోనూ రిపీట్ అవుతుందని టీమ్ సహా అభిమానులు కాన్పిడెంట్ గా ఉన్నారు. మరి ఆ నమ్మకాలు నిలబడతాయా? లేదా? అన్నది రిలీజ్ తర్వాత తేలుతుంది. ఈ చిత్రాన్ని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.