• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ గర్ల్‌ ఫ్రెండ్‌ ని...

ఈ గర్ల్‌ ఫ్రెండ్‌ ని తక్కువ అంచనా వెయ్యవద్దు

| ఇలాంటి సమయంలో గర్ల్‌ ఫ్రెండ్‌ ని అంత తక్కువ అంచనా వేయవద్దు అంటూ యూనిట్‌ సభ్యులు చెప్పకనే చెబుతున్నారు.

By - Tupaki Desk
Update: 2023-12-06 05:19 GMT

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్‌ స్టార్ ఇమేజ్ వచ్చిన వెంటనే నటిగా తమను తాము నిరూపించుకునేందుకు గాను లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. హీరోల పక్కన బుట్ట బొమ్మల మాదిరిగా నటిస్తూ, అందాల ఆరబోత చేయడంతో పాటు అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు.

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న కూడా లేడీ ఓరియంటెడ్‌ స్క్రిప్ట్‌ కి ఓకే చెప్పింది. తాజాగా ది గర్ల్‌ఫ్రెండ్‌ అనే పాన్‌ ఇండియా సినిమాకు సైన్‌ చేసిన రష్మిక మందన్న తాజాగా ఆ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయింది. టైటిల్‌ చూసి చాలా మంది ఈ సినిమా కథను, రష్మిక పాత్రను ఊహించేసుకుంటున్నారు.

ఇదో లవ్‌ స్టోరీ అని, రష్మిక ఒక వ్యక్తి ప్రేమలో పడుతుందని.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో గర్ల్‌ ఫ్రెండ్‌ ని అంత తక్కువ అంచనా వేయవద్దు అంటూ యూనిట్‌ సభ్యులు చెప్పకనే చెబుతున్నారు. ఈ గర్ల్‌ ఫ్రెండ్‌ నార్మల్‌ లేడీ కాదని వారు అంటున్నారు.

కథ ఊహకు అందని విధంగా ఉంటుందని, అంతే కాకుండా ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్రతో చేయించే యాక్షన్‌ సన్నివేశాలకు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా షాక్‌ అవుతారు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. రష్మిక ఈ సినిమాలోని పాత్ర కోసం ఏకంగా మార్షల్ ఆర్ట్స్‌ ను రెండు నెలలు ప్రాక్టీస్‌ చేసిందట.

రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో మరో స్టార్‌ హీరో కూడా గెస్ట్‌ రోల్‌ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ హీరో విజయ్‌ దేవరకొండ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రౌడీ స్టార్‌ యొక్క ఫ్యామిలీ స్టార్‌ లో రష్మిక గెస్ట్‌... కనుక రష్మిక గర్ల్‌ ఫ్రెండ్‌ లో రౌడీ స్టార్‌ గెస్ట్‌ అయ్యే ఛాన్స్ లు ఎక్కువ.

కనుక లేడీ ఓరియంటెడ్‌ మూవీ అని.. ఒక లవ్‌ స్టోరీ అని తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. కచ్చితంగా ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాతో రష్మిక సంచలనం సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె సన్నిహితులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Actress 
  • Rashmikamandanna 
  • Thegirlfriend 
  • Actressrashmika 
  • Socialmedia 
  • Story 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS