థామా నుంచీ మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. రష్మిక అందాలకు దాసోహం అంతే!
రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె ఇప్పుడు తాజాగా హారర్ జానర్ తో ప్రేక్షకులను పలకరించడానికి త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే.;
రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె ఇప్పుడు తాజాగా హారర్ జానర్ తో ప్రేక్షకులను పలకరించడానికి త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో ఈమె చేస్తున్న చిత్రం థామా.. ఆయుష్మాన్ ఖురానా తో కలిసి ఈమె నటిస్తున్న హారర్ థ్రిల్లర్ డ్రామా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన వీడియోలలో చాలా సీరియస్ గా కనిపించిన రష్మిక ఇందులో తొలిసారి యువతను ఆకట్టుకునేలా ఫోజులు ఇవ్వడంతో అభిమానులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఈ పాటలో యువతకు ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా తన అందాలతో రష్మిక ఆకట్టుకుందని చెప్పవచ్చు.
థామా నుండి విడుదల చేసిన ఈ పాటకు.." కొన్ని ప్రేమ కథలకు ఎప్పటికీ మరణం ఉండదు" అంటూ క్యాప్షన్ జోడించి సాంగ్ ను రిలీజ్ చేసింది. మొత్తానికి అయితే ఈ రొమాంటిక్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది హిందీలో వచ్చిన తుమ్ మేరే నా హుయే పాట అభిమానులను విపరీతంగా అలరిస్తోంది అని చెప్పవచ్చు. సినిమా విషయానికి వస్తే ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో ఈ సినిమాను మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సాంగ్ కూడా అలరిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
రష్మిక విషయానికి వస్తే.. ఛలో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రష్మిక. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం రావడంతో ఈమె జాతకం మరింత మారిపోయిందనే చెప్పాలి. ఆ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఛావా , కుబేర వంటి చిత్రాలతో కూడా వరుసగా బ్లాక్ బాస్టర్లు అందుకుంటూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ సమయంలోనే భారీ కలెక్షన్స్ అందుకున్న హీరోయిన్గా కూడా రికార్డ్ సృష్టించింది.
ఇప్పుడు కూడా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ తో కలిసి ఒక సినిమా చేస్తున్న ఈమె.. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పైగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడవ చిత్రం కూడా.. ఈ చిత్రాలతో పాటు రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలలో నటిస్తున్న రష్మిక మరొకవైపు కాంచన 4 లో కూడా నటిస్తోంది.