అనుకోకుండా జరిగిపోయింది.. కొంపతీసి ఎంగేజ్మెంట్ గురించా?
తాజాగా రష్మిక మందన్న నటిస్తున్న థామా నుండీ విడుదలైన ఒక పాట గురించి ఈ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల థామా నుంచి "నువ్వు నా సొంతమా" అనే పాట విడుదలై ఆకట్టుకుంది.;
నేషనల్ క్రష్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన్న గత కొంతకాలంగా విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు వినిపించాయి.. కానీ ఈ విషయంపై ఈ జంట అధికారికంగా స్పందించలేదు. దీనికి తోడు అక్టోబర్ 3వ తేదీన అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిని కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీనికి తోడు నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ పుట్టపర్తిలో దర్శనమిచ్చారు. అక్కడ ఆయన స్థానికుల నుంచి బొకే అందుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన చేతికి ఉన్న ఉంగరం కూడా ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా రష్మిక మందన్న అనుకోకుండా జరిగిపోయింది అంటూ చేసిన ఒక కామెంట్ అందరిలో మళ్లీ అనుమానాలు రేకెత్తించింది. కొంపతీసి ఎంగేజ్మెంట్ గురించి ఈమె మాట్లాడిందా అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి రష్మిక దేని గురించి ఈ కామెంట్ చేసింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా రష్మిక మందన్న నటిస్తున్న థామా నుండీ విడుదలైన ఒక పాట గురించి ఈ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల థామా నుంచి "నువ్వు నా సొంతమా" అనే పాట విడుదలై ఆకట్టుకుంది. ఇందులో రష్మిక తన అందంతో డాన్స్ మూమెంట్స్ తో అందరినీ అబ్బురపరిచింది. తాజాగా ఈ పాట వెనుక ఉన్న రహస్యాన్ని ఆమె వెల్లడించింది.
దీనిపై ఆమె స్పందిస్తూ.. "మేము దాదాపు 12 రోజులపాటు ఒక అద్భుతమైన ప్రదేశంలో షూటింగ్ నిర్వహించాము. అయితే చివరి రోజు మా దర్శక నిర్మాతలకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రదేశం ఇంత బాగుంది కదా.. మనం ఇక్కడే పాట ఎందుకు చేయకూడదు" అని అన్నారు. అందరికీ ఆ ఆలోచన నచ్చింది. అలా ఆ లొకేషన్ లో మూడు నాలుగు రోజుల పాటు రిహార్సల్స్ చేసి పాటను షూటింగ్ చేశాము. ఇది ప్లాన్ చేసిన వాటికంటే చాలా బాగా వచ్చింది. ఏది ఏమైనా అనుకోకుండా తీసుకున్న నిర్ణయం అటు చిత్ర బృందాన్నే కాదు ఇటు ఆడియన్స్ ని కూడా మెప్పించింది. ఈ పాటలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. తప్పకుండా థియేటర్లలో ఈ పాటను ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం" అంటూ కామెంట్ చేసింది రష్మిక మందన్న.
రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం థామా అనే బాలీవుడ్ సినిమాతో పాటు యానిమల్ మూవీకి సీక్వెల్ కి వచ్చే యానిమల్ పార్క్ లో కూడా నటిస్తోంది. అలాగే తెలుగులో లేడీ ఓరియంటెడ్ మూవీస్ అయిన ది గర్ల్ ఫ్రెండ్, మైసా వంటి సినిమాలు చేస్తోంది. బన్నీ - అట్లీ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా కీ రోల్ పోషిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా పుష్ప -2 కి సీక్వెల్ గా వచ్చే పుష్ప-3 లో కూడా నటిస్తోంది. అలా సీక్వెల్స్, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లతో చాలా బిజీగా గడుపుతోంది రష్మిక మందన్న.