• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మన వర్మను కాదని...

మన వర్మను కాదని ఆదిత్యతో....!

| బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణవీర్ సింగ్ మొన్నటి వరకు మన టాలీవుడ్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు

By - Tupaki Desk
Update: 2024-07-21 10:30 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణవీర్ సింగ్ మొన్నటి వరకు మన టాలీవుడ్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. కానీ ప్రశాంత్‌ వర్మ స్క్రిప్ట్‌ విషయంలో రణవీర్ సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేయడంతో సినిమా మొత్తానికే ఆపేశారనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద తెలియజేశాడట.

ఇప్పటికే ప్రశాంత్‌ వర్మ తన కొత్త ప్రయత్నాలు షురూ చేశాడు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత ను బాలయ్య చాలా నమ్మకంతో ప్రశాంత్‌ వర్మకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రశాంత్‌ వర్మ తో సినిమాలకు ప్రముఖ హీరోలు సిద్ధంగా ఉన్నారు. మరో వైపు రణవీర్ సింగ్‌ తదుపరి సినిమా కూడా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. ఇప్పటికే సింగం ఎగైన్ ను ముగించిన రణవీర్‌ సింగ్ ఇటీవల ప్రశాంత్‌ వర్మ మూవీ క్యాన్సిల్ అవ్వడంతో ఆదిత్య ధర్ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడట.

ఇప్పటికే ఆదిత్య ధర్‌ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగిసిందట. త్వరలోనే రణవీర్ సింగ్‌ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడని తెలుస్తోంది. జులై 25న సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ సినిమాలో రణవీర్‌ సింగ్‌ తో పాటు అర్జున్ రామ్‌ పాల్‌ మరియు సంజయ్‌ దత్‌ లు కీలక పాత్రలో నటించబోతున్నారు. థాయ్‌లాండ్‌ లో మొదటి షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేస్తున్నారు. ఇండియన్ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ కి సంబంధించిన కథ ను ఈ సినిమాలో చూపించబోతున్నారట.

విదేశాల్లోనే ఎక్కువగా ఈ సినిమా షూటింగ్‌ ఉంటుందని తెలుస్తోంది. మరి మన ప్రశాంత్‌ వర్మ ను కాదన్న రణవీర్ సింగ్‌ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూద్దాం అన్నట్లుగా తెలుగు ప్రేక్షకులు మరియు ప్రశాంత్‌ వర్మ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    
  • Ranveersingh 
  • Adityadhar 
  • Bollywood 
  • Prasanthvarma 
  • Ranveer 
  • Filmindustry 
  • Balakrishna 
  • Mokshagnya 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS