ఆ స్టార్ హీరో మరో రికార్డు చేధించేనా?
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కెరీర్ లో 500 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టిన తొలి చిత్రమేది అంటే? ఇటీవలే రిలీజ్ అయిన `ధురంధర్ `అనే చెప్పాలి.;
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కెరీర్ లో 500 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టిన తొలి చిత్రమేది అంటే? ఇటీవలే రిలీజ్ అయిన `ధురంధర్ `అనే చెప్పాలి. అంతకు ముందు రణవీర్ సింగ్ ఖాతాలో ఆ రేంజ్ వసూళ్ల సినిమా ఒక్కటీ లేదు. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన `రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ` చిత్రం 350 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. ఆ వేవ్ చూసి ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరుతుందని, ఇదే రణవీర్ టాప్ గ్రాసర్ గా నిలుస్తుందని ట్రేడ్ అంచనా వేసింది కానీ? ఆ మార్క్ కు చేరుకోలేకపోయింది. దీంతో రణవీర్ సింగ్ లాంగ్ గ్యాప్ తీసుకుని కొడ్తే కుంభ స్థలాన్నే కొట్టాలి అన్నట్లై స్పై జానర్లో `ధురంధర్` చేసాడు.
పోటీగా అవతార్-3 ఉన్నా?
ఈ సినిమా కోసం రణవీర్ సింగ్ ఎంతో కష్టపడ్డాడు. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పటికే సినిమా 500 కోట్లు దాటుకుని 750 కోట్ల మార్క్ ని కూడా దాటేసింది. దీంతో తాజాగా బాక్సాఫీస్ వద్ద కొత్త టార్గెట్ ఫిక్సైంది. ఇప్పుడీ చిత్రం రణవీర్ ని 1000 కోట్ల క్లబ్ లో చేర్చే చిత్రమవుతుందా? అని ఒకటే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి బాలీవుడ్ నుంచి పోటీగా ఏ సినిమా కూడా లేదు. ఇతర భాషల నుంచి ఏ రిలీజ్ లు అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా రిలీజ్ అయిన హాలీవుడ్ చిత్రం `అవతార్ ఫైర్ అండ్ యాష్` పై కూడా కొంత నెగిటివిటీ ఉంది.
ఆ సినిమాపై టాలీవుడ్ ఆసక్తి:
గత రెండు సినిమాల తరహాలోనే ఉందనే విమర్శలొస్తున్నాయి. పోటీగా అవతార్ ఆ సినిమాను మించిన వసూళ్ల దూకుడు `ధురంధర్` చూపిస్తోందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఏడాది ముగింపు కావడం..క్రిస్మస్ హాలీడేస్ కూడా కలిసొస్తున్నాయి. ఇది కూడా ధురంధర్ కు ప్లస్ అవుతుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు సహా ఇతర పరిశ్రమలు స్థానిక భాషల్లో కూడా రిలీజ్ చేసే బాగుంటుందనే చర్చా జరుగుతోంది. ప్రముఖంగా తెలుగు ఆడియన్స్ నుంచి బాలీవుడ్ కు రిక్వెస్ట్ లు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు లో డబ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
బాలీవుడ్ లో 1000 కోట్ల హీరోలు:
ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, `ధురందర్` లో ఇండియన్ స్పై పాకిస్తాన్ ఆపరేషన్ చేపట్టడం ఇవన్నీ ఆద్యంతం సినిమాకు పాజిటివ్ టాక్ ని రెట్టింపు చేస్తున్నాయి. ఇవన్నీ ధురంధర్ కు కలిసొస్తే గనుక 100 కోట్ల వసూళ్లు అన్నది పెద్ద విషయం కాదు. ఇప్పటికే బాలీవుడ్ లో 1000 కోట్ల క్లబ్ లో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లు ఉన్నారు. రణవీర్ సింగ్ `యానిమల్` తో దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోయాడు. `రామాయణం`తో ఆ ఫీట్ సాధిస్తాడని భారీ అంచనాలున్నాయి.