ప్రభాస్.. మాటల కన్నా గొప్ప పనులే!!

ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది.

Update: 2024-05-05 09:35 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లో మాస్ సినిమాలు చేసిన ప్రభాస్.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఛత్రపతి, యోగి వంటి చిత్రాలు ఆయనను స్టార్ గా ఎదిగేలా చేశాయి. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ఆయనకు వేరే లెవెల్ లో అభిమానులు ఉన్నారు.

అయితే సినిమాలతో ఆన్ స్క్రీన్ పై ప్రభాస్ ఎంత హడావుడి చేసినా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం కాస్త సైలెంట్ గానే ఉంటారు. పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తనకు నచ్చిన సినిమాలపై రివ్యూలు ఇస్తుంటారు. తన మూవీ అప్డేట్స్ ను షేర్ చేస్తుంటారు. అలా అని తన చిత్రాల ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా ఎక్కువగా మాట్లాడరు. ఇప్పుడు ఈ విషయంపైనే మరో టాలీవుడ్ హీరో రానా కామెంట్స్ చేశారు!

తాజాగా రానా.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ సమయంలో తన లాగా ప్రభాస్ ఇంతసేపు మాట్లాడరని తెలిపారు. కేవలం ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతారని చెప్పారు. మాటలు కన్నా గొప్ప పనులు చేయడానికే ఇష్టపడతారని పేర్కొన్నారు. చెప్పాలంటే.. ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటారని అన్నారు. ప్రస్తుతం రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

రానా.. ప్రభాస్ తో బాహుబలి సిరీస్ సినిమాల కోసం స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. బాహుబలిగా ప్రభాస్ నటించగా.. భల్లాల దేవ పాత్రలో కనిపించారు రానా. రెండు సినిమాల్లో తన యాక్టింగ్ తో అదరగొట్టారు. అప్పట్లో ఆయన నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. ప్రస్తుతం రజనీకాంత్ వెట్టియాన్ మూవీలో నటిస్తున్నారు రానా. ఆ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే... ఆయన నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ త్వరలో విడుదల కానుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 27వ తేదీన రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాతో పాటు రాజా సాబ్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుందని టాక్. ఇక సలార్-2, స్పిరిట్ చిత్రాలు కూడా త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. మరి ప్రభాస్ వరుస మూవీలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News