వారసుడి సైలెన్స్ జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్..!

సురేష్ బాబు తనయుడిగా లీడర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా మొదటి సినిమాతోనే తన విలక్షణతను చాటాడు.

Update: 2024-04-30 03:54 GMT

స్టార్ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు అంటే అతని కెరీర్ కి ఇక ఢోకా లేదనే ఫిక్స్ అవుతారు. సినిమాలు ఫ్లాప్ పడినా సరే మరో ఛాన్స్ రెడీగా ఉంటుంది. ఈలోగా వారి టాలెంట్ చూపించేస్తే మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడినట్టే.. అయితే అందరి స్టార్ వారసులకి భిన్నంగా స్టార్ గా కాదు నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు రానా దగ్గుబాటి. సురేష్ బాబు తనయుడిగా లీడర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా మొదటి సినిమాతోనే తన విలక్షణతను చాటాడు.

హీరో, విలన్ కాదు నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో అతన్ని ఆడియన్స్ భళ్లాలదేవగా ఆదరించారు.. డేనియల్ శేఖర్ గా సూపర్ అనేశారు. ముందు చెప్పినట్టుగా సినిమాలో లీడ్ రోల్ కాదు సినిమాకు భాగమైనా తన పాత్ర వరకు ది బెస్ట్ ఇవ్వాలని అనుకునే వారిలో రానా ఒకడు. అయితే ప్రయోగాలు కొంతవరకు ఓకే కానీ అసలు సినిమాలు చేయకుండా ఉంటే కెరీర్ రిస్క్ లో పడినట్టే అవుతుంది.

2022 లో రానా భీమ్లా నాయక్, విరాటపర్వం రెండు సినిమాలు చేశాడు. ఆ తర్వాత నిఖిల్ స్పై లో క్యామియో రోల్ చేశాడు. ప్రస్తుతం రానా సూపర్ స్టార్ రజినీకాంత్ వేటయ్యాన్ సినిమాలో నటిస్తున్నాడు. రానా చేయాలనుకుంటే భారీ బడ్జెట్ తో బాహుబలి లాంటి సినిమా తీయొచ్చు. కానీ పాత్ర తనని ఎంచుకోవాలి కానీ తను కావాలనుకోవడం కాదని ఫిక్స్ అయ్యాడు. అందుకే విలన్ వేషాలతో సరిపెట్టుకుంటున్నాడు.

Read more!

అయితే దగ్గుబాటి వారసుడిగా రానా సినీ కెరీర్ పై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. స్పెషల్ రోల్స్ చేసినా ఓకే కానీ హీరోగా సినిమాలు చేయాలని అంటున్నారు. సినిమాల్లో లీడ్ రోల్ గా తప్పితే విలన్ గానో.. నిర్మాతగానో రానా చేస్తూ వస్తున్నాడు. మరి రానా మనసులో ఏముందో కానీ ఫ్యాన్స్ మాత్రం రానా నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రానాని మెప్పించే కథలు రావడం లేదు కాబట్టే అతను ఇలా విలన్ రోల్స్ చేస్తున్నాడని అంటున్నారు. అందుకే రానాని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన స్టోరీస్ రాస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. రానా లీడ్ రోల్ లో హిరణ్యకశ్యప సినిమా ఒకటి ప్లాన్ చేశారు. కానీ అది ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

Tags:    

Similar News