• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రానా × అనిరుద్.. ఇది అసలు...

రానా × అనిరుద్.. ఇది అసలు సంగతి!

| టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ హర్ష వడ్లమూడితో కలిసి కొత్తగా బిజినెస్ లోకి దిగారు.

By - Tupaki Desk
Update: 2024-08-27 05:37 GMT

టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ హర్ష వడ్లమూడితో కలిసి కొత్తగా బిజినెస్ లోకి దిగారు. కొన్ని రోజుల క్రితం ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు మీడియాలో కాస్త ఎక్కువగా వైరల్ అయ్యాయి. ఏదైనా ప్రాజెక్టు చేస్తున్నారేమో అని అందరు అనుకున్నారు. కలిసి పెద్దగా సినిమాలు చేయకపోయినా కూడా ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇక ఫైనల్ గా వారు కలవడానికి గల కారణాన్ని చెప్పేశారు.


మెక్సికోలో లోకా లోకా టెకీలా డ్రింక్ తయారీ కేంద్రం ఉంది. అక్కడి ఉత్పత్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా వాటిని మార్కెట్ చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఈ టెకీలా బ్రాండ్ ని మార్కెట్ లోకి తీసుకొని వచ్చారు. త్వరలో ఇండియన్ మార్కెట్ లోకి కూడా ఇది రాబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యాపారంలో భాగస్వాములైన రానా దగ్గుబాటి, అనిరుద్ రవిచందర్ మెక్సికో లోని టెకీలా డ్రింక్ తయారీ కేంద్రానికి వెళ్లి అక్కడ వ్యవసాయ క్షేత్రంలో రైతులతో ముచ్చటించారు.


అగావె మొక్కలని కట్ చేసి టెకీలాని ఎలా తయారు చేస్తారనేది రానా దగ్గుబాటి, అనిరుద్ రవిచందర్ అడిగి తెలుసుకున్నారంట. పంటలని ఎలా సాగు చేస్తారు. తరువాత ఆ మొక్క కాండంతో సహజసిద్ధమైన టెకీలాని ఎలా తయారు చేస్తారనేది ఉత్పత్తి కేంద్రంలో తెలుసుకునే ప్రయత్నం చేశారంట.


మెక్సికోలోని లోకా కోలా టెకీలా డిస్టిలరీ సెంటర్ లో పర్యటన మరుపురాని అనుభూతిని ఇచ్చిందని రానా దగ్గుబాటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అందులో వ్యవసాయ క్షేత్రంలో రైతులతో కలిసి దిగిన ఫోటోని కూడా రానా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఇప్పటికే లోకా లోకా టెకీలా బ్రాండ్ ని అందుబాటులోకి తెచ్చారు. ఈ టెకీలా బ్రాండ్ ని రానా దగ్గుబాటి, అనిరుద్ దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నారు.

హర్ష వడ్లమూడితో కలిసి ఇరానీ హిల్ సంస్థ ద్వారా ఈ లోకా లోకా టెకీలాని ఉత్పత్తి చేస్తున్నారంట. ఇప్పటికే రానా వివిధ వ్యాపారాలలో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో కలిసి ఈ టెకీలా డ్రింక్ బిజినెస్ లోకి కూడా దిగిపోయాడని అర్ధమవుతోంది. మరి ఈ టెకీలా బ్రాండ్ ని ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పుడు తీసుకొని వస్తారా అనేది అందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే రానా ప్రస్తుతం టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న వేట్టయాన్ మూవీలో విలన్ గా చేస్తున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్, రజినీకాంత్ కాంబోలో సిద్ధమవుతోన్న కూలీలో కూడా భాగం అయ్యారు. ఈ రెండు సినిమాలకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తూ ఉండటం విశేషం. అలాగే తెలుగులో దేవర సినిమాతో అనిరుద్ బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నారు.

Tags:    
  • Ranadaggubati 
  • Tollywood 
  • Filmindustry 
  • Anirudh 
  • Usa 
  • Mexico 
  • Movies 
  • Tekiladrink 
  • Harshavadlamudi 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS