• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సత్యభామ కోసం మరో బిగ్...

సత్యభామ కోసం మరో బిగ్ స్టార్

| ఈ నేపథ్యంలో సత్యభామ మూవీ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ రాబోతున్నాడంట. కాజల్ అగర్వాల్ రిక్వెస్ట్ మేరకు ఆమెకి సపోర్ట్ గా నిలబడటానికి చరణ్ సత్యభామ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చే ఛాన్స్ ఉందంట.

By - Tupaki Desk
Update: 2024-05-26 04:36 GMT

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత ఏడాది భగవంత్ కేసరి మూవీలో కనిపించి కమర్షియల్ గా సక్సెస్ అందికుంది. ఇక ఈ ఏడాది సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఫీమేల్ సెంట్రిక్ కథతో సత్యభామ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య ఈ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. సుమన్ చిక్కాల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

 

శశికిరణ్ ఈ సినిమాకి సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. సత్యభామ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్ లో మూవీ కథాంశం ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. జూన్ 7న మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సత్యభామ చిత్రాన్ని వీలైనంతగా జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి కాజల్ అగర్వాల్ స్ట్రాంగ్ ప్రమోషన్ చేస్తోంది.

దాంతో పాటుగా తన పరిచయాలని కూడా ఉపయోగిస్తోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో కాజల్ అగర్వాల్ జతకట్టింది. వీరందరితో మంచి బాండింగ్ ఉంది. కెరియర్ ఆరంభంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా మగధీర చిత్రంలో కాజల్ అగర్వాల్ నటించింది. ఈ మూవీ ఇద్దరిని స్టార్స్ గా మార్చింది. మగధీర నుంచి చరణ్ తో కాజల్ అగర్వాల్ కి మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది.

ఈ నేపథ్యంలో సత్యభామ మూవీ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ రాబోతున్నాడంట. కాజల్ అగర్వాల్ రిక్వెస్ట్ మేరకు ఆమెకి సపోర్ట్ గా నిలబడటానికి చరణ్ సత్యభామ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చే ఛాన్స్ ఉందంట. అయితే దీనిపై చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక వేళ చరణ్ ఈవెంట్ కి వస్తే మాత్రం సత్యభామ సినిమాకి కచ్చితంగా అది ప్లస్ అవుతుంది.

ఇప్పటికే బాలయ్య ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా నందమూరి ఫ్యాన్స్ ని కాజల్ అగర్వాల్ మెప్పించింది. వారు సత్యభామ మూవీ చూడటానికి ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తే మెగా ఫ్యాన్స్ కూడా సినిమాపై దృష్టి పెట్టె ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

Tags:    
  • Satyabhama 
  • Kajalaggarwal 
  • Ramcharan 
  • Magadheera 
  • Moviepromotions 
  • Prereleaseevent 
  • Nandamuribalakrishna 
  • Trailerlunchevent 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS