• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ చరణ్.. ఏడాది టైమ్ లో...

రామ్ చరణ్.. ఏడాది టైమ్ లో మూడు!

| గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సోలోగా చేస్తోన్న మూవీ గేమ్ చేంజర్.

By - Tupaki Desk
Update: 2024-03-28 05:14 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సోలోగా చేస్తోన్న మూవీ గేమ్ చేంజర్. దీనికంటే ముందు తండ్రి మెగాస్టార్ తో కలిసి ఆచార్య చిత్రంలో నటించారు. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. రామ్ చరణ్ క్యారెక్టర్ బాగానే ఉన్నప్పటికీ మూవీలో బలమైన కథ, కథనం బలంగా లేకపోవడంతో ఫెయిల్ అయ్యింది. ఈ సారి పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమాని దిల్ రాజు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. 2024 ఆఖరులో గేమ్ చేంజర్ మూవీని థియేటర్స్ లోకి తీసుకొని రాబోతున్నారంట. అక్టోబర్ నెలలో డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు కాబోతోంది.

400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ 2025లో రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ జోనర్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందంట. ఇదిలా ఉంటే తాజాగా సుకుమార్ దర్శకత్వంలో RC17 చిత్రాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు రానటువంటి సరికొత్త కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ ఏడాది ఆఖరులో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 2025 ఆఖరులో మూవీ రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్, చరణ్ కాంబోలో రంగస్థలం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మరల దీంతో సెకండ్ బ్లాక్ బ్లాస్టర్ కొట్టాలని అనుకుంటున్నారు. చరణ్ నుంచి రాబోయే ఈ మూడు సినిమాలు 12 నెలలో గ్యాప్ లో థియేటర్స్ లో వస్తాయంట.

ఒక స్టార్ హీరో నుంచి ఇంత తక్కువ టైంలో మూడు సినిమాలు రిలీజ్ కావడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఆర్ఆర్ఆర్ తో వచ్చిన గ్యాప్ ని వీలైనంత వేగంగా తగ్గించి. ఏడాదికి రెండు సినిమాలని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేయాలని చరణ్ ప్లాన్ చేసుకుంటున్నారంట. అందుకే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్ తో కంప్లీట్ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్.

అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. దిల్ రాజు తో కూడా మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్. ఇక కన్నడ ప్రొడక్షన్ KVN వారితో కూడా సినిమా చేయనున్నట్లు టాక్. ఇక ప్రశాంత్ నీల్ తో గతంలోనే చర్చలు జరిగాయి. మరి ఈ కొత్త కాంబినేషన్స్ పై చరణ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.

Tags:    
  • Ramcharan 
  • RC16 
  • RC17 
  • Gamechanger 
  • Shankar 
  • Buchibabusana 
  • Sukumar 
  • Panindiaprojects 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS