ఐఏఎస్ చ‌ర‌ణ్ ఇలా ఉంటాడా?

`గేమ్ ఛేంజర్` షూటింగ్ అప్ డేట్ ఏంటి? అన్న‌ది తెలియ‌దు. అందులో చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉంటుంద‌న్న‌ది అస‌లే తెలియ‌దు.

Update: 2024-05-09 06:40 GMT

`గేమ్ ఛేంజర్` షూటింగ్ అప్ డేట్ ఏంటి? అన్న‌ది తెలియ‌దు. అందులో చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉంటుంద‌న్న‌ది అస‌లే తెలియ‌దు. ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి లీక్ అధికారికం గానూ లేదు అన‌ధికారికంగానూ రాలేదు. చ‌ర‌ణ్ రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నారన్న‌ది మాత్రం బ‌లంగా వినిపిస్తోన్న మాట‌. క‌లెక్ట‌ర్ పాత్ర ఒక‌టైతే.. రాజ‌కీయ నాయ‌కుడిగా మ‌రో పాత్ర‌లో క‌నిపిస్తార‌ని బ‌ల‌మైన సంకేతాలే అందుతున్నాయి. ఐఏఎస్ పొలిటీష‌న్ గా ట‌ర్న్ అయితే శంక‌ర్ క‌థ ఎలా న‌డిపించారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం.


మ‌రి చ‌ర‌ణ్ లుక్ సంగ‌తి ఏంటి? అంటే రెండు పాత్ర‌లు సెన్సిటివ్. అందుకోసం లుక్ ప‌రంగా పెద్ద‌గా క‌స‌ర‌త్తులేమి అవ‌సరం లేదు. గేమ్ ఛేంజ‌ర్ మొద‌లైన నాటి నుంచి చ‌ర‌ణ్ కండ‌లు పెంచుతున్నాడ‌ని గానీ..లుక్ ప‌రంగా మేకోవ‌ర్ అయిన‌ట్లు గానీ ఎలాంటి ప్ర‌చారం లేదు. అలా చేసిన‌ట్లు కూడా ఎక్క‌డా లీకులు కూడా లేవు. ఆ ర‌కంగా చూసుకుంటే చ‌ర‌ణ్ లుక్ ప‌రంగా శంక‌ర్ పెద్ద‌గా క‌స‌ర‌త్తులు చేయించ‌లేదు. చ‌ర‌ణ్ నేచుర‌ల్ లుక్ లోనే సినిమాలో కనిపించే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

Read more!

ఆన్ ది సెట్స్ ప‌క్క‌న‌బెట్టి ఆఫ్ ది సెట్స్ చెక్ చేస్తే చ‌ర‌ణ్ చాలా సంద‌ర్భాల్లో క్యాజువ‌ల్స్ లోనే ఎక్కువ‌గా బ‌య‌ట క‌నిపిస్తున్నాడు. వెకేష‌న్ల‌కు వెళ్లినా? ఏదైనా ఈవెంట్ లో పాల్గొన్నా..ప‌ని మీద ముంబై వెళ్లినా ఎక్క‌డికి వెళ్లినా ప్యాంట్ ష‌ర్టు లోనే క‌నిపిస్తున్నాడు. హెయిర్ స్టైల్ ద‌గ్గ‌ర నుంచి కాళ్ల‌కు తొడిగే బూట్ల వ‌ర‌కూ అంతా పార్మ‌ల్ గానే హైలైట్ అవుతున్నాడు. దీన్ని బ‌ట్టి చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ లో ఇలాగే కనిపించొచ్చు అని అభిమానులు ఓ అంచనాకి వస్తున్నారు.


తాజాగా చ‌ర‌ణ్ న్యూలుక్ ఒక‌టి నెట్టింట చ‌క్కెర్లు కొడుతుంది. ప‌ద్మ అవార్డుల కార్య‌క్ర‌మం కోసం ఢిల్లీ బ‌య‌ల్దేరిన చ‌ర‌ణ్ ఎయిర్ పోర్టులో కెమెరా కంట చిక్కాడు. అందులో సింపుల్ జీన్స్ టీష‌ర్ట్..క్యాజువ‌ల్ బ్లాక్ ప్యాంట్ ధ‌రించారు. క‌ళ్ల‌కు న‌ల్ల‌టి క‌ళ్ల అద్దాలు ధ‌రించారు. ఇక హెయిర్ స్టైల్ రెగ్యుల‌ర్ ఫార్మెట్ లో నే ఉంది. ప‌క్క‌ పాపిడి తీసాడు. మీసాలు కొద్దిగా పెంచాడు. గెడ్డం మాత్రం లేకుండా క్లీన్ షేవ్ లో ఉన్నాడు. టాప్ టూ బాట‌మ్ చ‌ర‌ణ్ ని ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తే స్టార్ట్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. ఈ లుక్ కాస్త ఐఏఎస్ కి ద‌గ్గ‌ర‌గా అనిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది

4

Tags:    

Similar News