• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RC16 : ఎట్టకేలకు...

RC16 : ఎట్టకేలకు ఎదురుచూపులకు తెర

| మార్చి 20న టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో చరణ్‌, బుచ్చిబాబు కాంబో మూవీ షూటింగ్ ప్రారంభం అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-03-15 03:43 GMT

మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చరణ్‌ - బుచ్చిబాబు మూవీ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా బుచ్చి బాబు ఒక్కసారిగా టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన విషయం తెల్సిందే. చరణ్ తో బుచ్చి బాబు సినిమా ప్రకటించి ఏడాది దాటింది.

చరణ్‌ గేమ్‌ చేంజర్ సినిమాతో బిజీగా ఉండటం వల్ల బుచ్చిబాబు సినిమా షూటింగ్‌ మొదలు పెట్టలేదు. ప్రస్తుతం కూడా వైజాగ్ లో గేమ్‌ చేంజర్‌ సినిమా షూటింగ్ లో చరణ్‌ పాల్గొంటున్నాడు. ఎట్టకేలకు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్ మూవీ షూటింగ్‌ ప్రారంభంకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

మార్చి 20న టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో చరణ్‌, బుచ్చిబాబు కాంబో మూవీ షూటింగ్ ప్రారంభం అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏ క్షణంలో అయినా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గేమ్‌ చేంజర్‌ షూటింగ్ లో ఉన్న చరణ్ ఆ షెడ్యూల్‌ పూర్తి అవ్వగానే బుచ్చిబాబు మూవీ షూట్‌ లో పాల్గొనబోతున్నాడని సమాచారం అందుతోంది.

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో స్పోర్ట్స్‌ రూరల్‌ యాక్షన్ డ్రామాతో మూవీ రూపొందబోతుంది. హీరోయిన్‌ గా జాన్వీ కపూర్‌ ఎంపిక అయ్యింది. మరో హీరోయిన్‌ గా కృతి సనన్‌ ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. భారీ బడ్జెట్‌ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందించబోతున్నారు.

రామ్‌ చరణ్, జాన్వీ కపూర్‌ జోడీ కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడబోతుంది. గేమ్‌ చేంజర్ ను ఇదే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక బుచ్చిబాబు, చరణ్‌ కాంబో మూవీ 2025 సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Tags:    
  • Ramcharan 
  • Buchibabu 
  • Rc16 
  • Movieshooting 
  • Tollywoodcelebrities 
  • Sportsruralactiondrama 
  • Janhvikapoor 
  • Gamchanger 
  • Shankar 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS