• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ చరణ్ 'పెద్ది'.....

రామ్ చరణ్ 'పెద్ది'.. ఎంతవరకు వచ్చింది?

| అలాగే క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ ని ప్రస్తుతానికి ఖరారు చేశారు.

By - Tupaki Desk
Update: 2024-07-21 17:34 GMT

గ్లోబ్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేశారు. నెక్స్ట్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC 16 సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేశారు. మూవీ పీరియాడిక్ జోనర్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందంట. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మూవీ కథని దర్శకుడు బుచ్చిబాబు చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ మెన్ కి తగ్గట్లుగా రామ్ చరణ్ తన లుక్ మార్చుకోవాల్సి ఉంటుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ కాబట్టి గెడ్డంలో కనిపించాల్సి ఉంటుందంట. వీటిని దృష్టిలో ఉంచుకొని క్యారెక్టర్ మేకోవర్ కోసం రామ్ చరణ్ రెండు నెలలు టైం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. గెడ్డంతో పాటు మీసకట్టు కూడా ఈ మూవీ కోసం కావాలంట. ఈ లుక్ వస్తే సెప్టెంబర్ లో సినిమాని సెట్స్ పైకి వెళ్లాలని బుచ్చిబాబు అనుకుంటున్నారంట. ప్రస్తుతం మూవీ ప్రీప్రొడక్షన్ తో పాటుగా సెట్ వర్క్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ ని ప్రస్తుతానికి ఖరారు చేశారు. అయితే మరో రెండు, మూడు టైటిల్స్ ని అనుకుంటున్న కూడా ఆల్ మోస్ట్ ఇదే టైటిల్ కి అందరూ మొగ్గు చూపించారంట. దీంతో ‘పెద్ది’ టైటిల్ తోనే ఈ సినిమా షూటింగ్ ని కూడా బుచ్చిబాబు స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో నడిచే కథ కాబట్టి రామ్ చరణ్ స్లాంగ్ కూడా స్థానిక యాసలోనే ఉండబోతోంది.

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఖరారు చేశారు. ఇప్పటికే దేవర సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. మొదటి సినిమా పాన్ ఇండియా సినిమానే చేస్తోన్న జాన్వీకి రెండో సినిమా ఆఫర్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం. ఆమె క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా బలంగా ఉంటుందంట.

భారీ బడ్జెట్ తో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా పెద్ది చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. వచ్చే ఏడాది ఆఖరులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందన తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని చెప్పొచ్చు.

Tags:    
  • Ramcharan 
  • Buchibabu 
  • Janhvikapoor 
  • Shankar 
  • Gamechanger 
  • Sivarajkumar 
  • Kannadaactor 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS