సింగిల్ లైఫ్ పై ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఏమంటున్నాడంటే?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వ్యక్తిగత జీవితం, పెళ్లి , సింగిల్ లైఫ్‌పై తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.;

Update: 2026-04-13 09:05 GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వ్యక్తిగత జీవితం, పెళ్లి , సింగిల్ లైఫ్‌పై తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా రామ్ పెళ్లి పై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ‌స్తోన్న‌ నేపథ్యంలో తాజాగా మనసులో మాటను బయటపెట్టారు. బలవంతంగా బంధాల్లోకి వెళ్లడం కంటే? మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే ఆ నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. రామ్ దృష్టిలో ఒంటరితనం అంటే అది కేవలం ఏకాంతం మాత్రమే కాదు.

ఒక రకమైన మానసిక ప్రశాంతత. నిరంతరం షూటింగ్‌లు, ప్రయాణాలు , గ్లామర్ ప్రపంచంలో బిజీగా ఉండే రామ్ తన కోసం తాను కేటాయించుకునే సమయం చాలా అవసరమని భావిస్తాన‌న్నాడు. సింగిల్ లైఫ్ తనను తాను విశ్లేషించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి , ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి తోడ్పడుతోందన్నాడు. ఒంటరిగా ఉండటంలో ఉన్న సౌకర్యాన్ని గొప్ప వరంగా భావిస్తున్నాన్నాడు. అలాగ‌ని రామ్ పెళ్లికి లేదా బంధాలకు వ్యతిరేకం మాత్రం కాదు. కేవలం సమాజం కోసమో లేదా వయసు పెరిగిపోతుందన్న భయంతోనో పెళ్లి చేసుకోవడం ఆయనకు ఇష్టం లేదు.

ఎప్పుడైతే తన ఆలోచనలకు, తన వ్యక్తిత్వానికి సరిపోయే సరైన అమ్మాయి దొరుకుతుందో? అప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని భరోసా ఇచ్చాడు. ఆ బంధం అనేది సహజంగా , ఇష్టపూర్వకంగా ఏర్పడాలి తప్ప ఎవరి ఒత్తిడితోనో జరగకూడదన్నది రామ్ సిద్ధాంతంగా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ దృష్టంతా వృత్తిపరమైన విజయాలపైనే ఉందని రామ్ పేర్కొన్నారు. సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించడం, ప్రేక్షకులను అలరించడం తన మొదటి ప్రాధాన్యతని, వ్యక్తిగత విషయాల గురించి అతిగా ఆలోచించ‌డం చెందడం లేదని వివరించాడు.

సరైన వ్యక్తి తన జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆ విషయాన్ని తానే స్వయంగా అభిమానులతో పంచుకుంటానని, అంత వరకు సింగిల్ లైఫ్ ప్రయాణాన్ని సంతోషంగా కొనసాగిస్తానని నవ్వుతూ చెప్పాడు. రామ్ పోతినేని మాటలు నేటి తరం యువతలో సెల్ఫ్-లవ్, క్లారిటీ పట్ల ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయి. ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండటం సాధ్యమేనని, సరైన సమయం వచ్చినప్పుడు బంధాలు వాటంతట అవే కుదురుతాయని చాటి చెప్పాడు. స్పష్టమైన ఆలోచనా ధోరణి రామ్ వ్యక్తిత్వంలోని పరిణితిని తెలియజేస్తోంది.

రామ్ గ‌త ఏడాది ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాకు మంచి రివ్యూలు వ‌చ్చాయి. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. కానీ అనుకున్న స్థాయిలో సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. దీంతో క‌మ‌ర్శియ‌ల్ స‌క్స‌స్ కు సినిమా దూర‌మైంది. ప్ర‌స్తుతం కొత్త ప్రాజెక్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు

Tags:    

Similar News