గ్లోబల్ స్టార్ చరణ్.. అంతా పక్కా ప్లాన్ తోనే..

కానీ దాన్ని మర్చిపోయి ఇప్పుడు వరుస సినిమాలతో వచ్చి.. తమ ఫేవరెట్ హీరో మంచి హిట్స్ అందుకోవాలని అంతా ఆశిస్తున్నారు.;

Update: 2025-07-17 15:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ జోనర్ లో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో మూవీ విడుదలైంది.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. ఆర్ఆర్ఆర్ తర్వాత సోలోగా చరణ్ నటించిన మూవీ కావడంతో అంతా మంచి హోప్స్ పెట్టుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్రంగా ఫీలయ్యారు. తమ హీరో మూడు సంవత్సరాల టైమ్ వేస్ట్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ దాన్ని మర్చిపోయి ఇప్పుడు వరుస సినిమాలతో వచ్చి.. తమ ఫేవరెట్ హీరో మంచి హిట్స్ అందుకోవాలని అంతా ఆశిస్తున్నారు. అదే సమయంలో చరణ్ కూడా పక్కా ప్లాన్ తో మందుకెళ్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. శరవేగంగా సినిమాలు కంప్లీట్ చేసి.. థియేటర్స్ లో సందడి చేసేలా సిద్ధమవుతున్నారని సమాచారం.

అయితే ఇప్పుడు చరణ్.. పెద్ది మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో జరుగుతోంది. స్పోర్ట్స్ కమ్ రూరల్ డ్రామాగా రూపొందుతున్న పెద్ది మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకుంది.

వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్ది నెలల క్రితం అనౌన్స్ చేశారు. అయితే ఆ మూవీ షూటింగ్ ను 2025 చివరికల్లా కంప్లీట్ చేయాలని చరణ్ గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి వాయిదా పడకుండా చూడాలని ఇప్పటికే మేకర్స్ కు చెప్పినట్లు సమాచారం.

పెద్ది షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే సుకుమార్ సినిమాను మొదలు పెట్టనున్నారు. సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ సహా ఇతర ఫార్మాలిటీలపై పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో సుకుమార్- చరణ్ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా ఎటువంటి మార్పు లేకుండా ప్రణాళికలను మార్చుకోకుండా, తన షెడ్యూల్‌ కు కట్టుబడి ఉండాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News