'పెద్ది' అప్‌డేట్... జూన్ నెల మొత్తం అదే!
రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రూపొందుతున్న 'పెద్ది' సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.;

రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రూపొందుతున్న 'పెద్ది' సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి సినిమా ఉప్పెనతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బుచ్చిబాబు ఈ సినిమాను తన గురువు సుకుమార్ స్టైల్ లో రూపొందిస్తున్నాడు. గురువును మించిన శిష్యుడు అనిపించుకునే స్థాయిలో పెద్ది సినిమాను బచ్చిబాబు రూపొందిస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు కొందరు అంటున్నారు. రామ్ చరణ్ ను రంగస్థలంలో చూసి అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. సుకుమార్ ఆ సినిమాలో రామ్ చరణ్ ను చూపించిన తీరుకు మెగా ఫ్యాన్స్ సైతం వావ్ అన్నారు.
ఇప్పుడు రామ్ చరణ్ కొత్త లుక్‌తో పెద్దిలో కనిపిస్తున్నాడు. రంగస్థలం లుక్‌తో పోల్చితే మరింత ఆకట్టుకునే విధంగా 'పెద్ది'లో రామ్ చరణ్ లుక్ ఉంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నెట్టింట ఈ సినిమాకు సంబంధించిన విషయాలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఆ మధ్య వచ్చిన గ్లిమ్స్ తో బుచ్చిబాబు షేక్ చేశాడు. ముఖ్యంగా చరణ్‌తో ఆడించిన ఆ క్రికెట్ షాట్‌కి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. వామ్మో ఇదెక్కడి మాస్ మావ అంటూ నెట్టింట రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్‌కి ఫిదా అవుతున్నారు. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఆరంభంలో విడుదల చేయబోతున్నారు. ఇంకా చాలా సమయం ఉంది కదా అని బుచ్చిబాబు స్లోగా షూటింగ్ చేయడం లేదు.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే పెద్ది సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది. ముఖ్యమైన టాకీ పార్ట్ పూర్తి చేశారు. యాక్షన్ సన్నివేశాలను సైతం షూట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల మొత్తం అదే షూట్ ఉంటుందని తెలుస్తోంది. భారీ యాక్షన్ పార్ట్‌తో పాటు, రెండు మూడు టాకీ పార్ట్ సీన్స్ ను షూట్ చేయడం కోసం ఏర్పాట్లు చేశారు. జూన్ నెల మొత్తం పెద్ది షూటింగ్‌తో రామ్ చరణ్, బుచ్చిబాబు బిజీ బిజీగా ఉండబోతున్నారు. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరి వరకు షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టే ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నాడు. అందుకే గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నాడు.
రామ్ చరణ్ గత చిత్రం గేమ్ ఛేంజర్ తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విషయంలో ఎలాంటి సందేహం ను ఫ్యాన్స్ వ్యక్తం చేయడం లేదు. ఫ్యాన్స్ ఈ సినిమా విషయమై చాలా నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా బుచ్చిబాబు మార్క్ మాస్ యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. నెట్టింట ఇప్పటికే పెద్ది సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
పైగా ఈ సినిమాలో జగదేక వీరుడు చిరంజీవి తనయుడు చరణ్‌కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించడంతో టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా అన్ని భాషల్లోనూ బజ్ క్రియేట్ అయింది. దేవర సినిమాతో ఇప్పటికే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.