పెద్ది మూవీ.. అడుగడుగునా చరణ్ కసి కనిపిస్తోందిగా!
కాగా పెద్ది సినిమా కోసం చరణ్ కష్టపడటం మాత్రమే కాకుండా రిస్క్ కూడా చేస్తున్నారని లీకైన సాంగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది.;
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత అదే స్థాయి సినిమాలను తీసి తన సత్తా చాటుతారని అందరూ అనుకున్నారు. చరణ్ కూడా తన కెరీర్ ను అలానే ప్లాన్ చేసుకున్నారు. కానీ తానొకటి తలస్తే దైవం ఇంకోటి తలచిందన్నట్టు స్టార్ డైరెక్టర్ శంకర్ తో తీసిన గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, వెచ్చించిన టైమ్ అన్నీ బూడిదలో పోసినట్టయ్యాయి.
పెద్దితో హిట్ కొట్టాలని చూస్తున్న చరణ్
గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత చరణ్ తన తర్వాతి సినిమాతో ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని ఎంతో కసిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాను అనుకున్నది అందుకోవడం కోసం ఈసారి ఏదైనా చేయడానికి చరణ్ రెడీగా ఉన్నారు. పెద్ది సినిమా కోసం చరణ్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని, సినిమా షూటింగ్ నుంచి వస్తున్న లీక్ వీడియోలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఫస్ట్ షాట్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ తెగ కష్టపడుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటినుంచి మంచి అంచనాలుండగా, మొన్నా మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ కు, పోస్టర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం కూడా పెద్ది క్రేజ్ ను ఇంకాస్త పెంచింది.
కష్టమే కాదు, రిస్క్ కూడా
కాగా పెద్ది సినిమా కోసం చరణ్ కష్టపడటం మాత్రమే కాకుండా రిస్క్ కూడా చేస్తున్నారని లీకైన సాంగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. సాంగ్ లో భాగంగా చరణ్, ఓ లోయ అంచున ఉన్న చెట్టు కొమ్మపై నిలబడి, ఎంతో ఈజ్ తో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. చెట్టు కొమ్మపై డ్యాన్స్ వేయడమే ప్రమాదం అయితే, చరణ్ లోయ అంచున ఉన్న చెట్టు కొమ్మపై డ్యాన్స్ చేయడం ఎంత ప్రమాదమో ఊహించుకోవచ్చు. ఆ వీడియో చూసి కొందరు షాకవగా, మరికొందరు టెన్షన్ పడుతున్నారు. ఇంకొందరైతే చరణ్ డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు.
పెద్ది అద్భుతంగా ఉంటుందని చరణ్ హామీ
ఇక రీసెంట్ గా పెద్ది షూటింగ్ నుంచి మరో వీడియో క్లిప్ బయటకు రాగా, ఆ వీడియోలో చరణ్ నిటారుగా ఉన్న కొండలు ఎక్కుతూ కనిపించారు. చరణ్ వెనుకే డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఉన్నప్పటికీ అతను మాత్రం పక్క వాళ్ల సపోర్ట్ తీసుకుని ఆ కొండను ఎక్కుతుంటే చరణ్ మాత్రం ఎలాంటి సపోర్ట్ లేకుండా కనిపించారు. ఇవన్నీ చూస్తూంటే చరణ్ పెద్ది విషయంలో ఎంత సిన్సియర్ గా ఉన్నారో తెలుస్తోంది. అంతేకాదు, మొన్నామధ్య ఓ ఈవెంట్ లో చరణ్ పెద్ది గురించి మాట్లాడుతూ, తాను ఇంతకు ముందెప్పుడూ ఇలా చెప్పలేదని, కానీ పెద్ది అద్భుతంగా ఉంటుందని స్టేట్‌మెంట్ ఇవ్వడంతో చరణ్ ఈసారి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని అందరూ భావిస్తున్నారు. కాగా మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అదే రోజున చరణ్ బర్త్ డే కూడా కావడంతో మెగా ఫ్యాన్స్ కు పెద్ది రిలీజ్ చాలా స్పెషల్ గా మారనుంది.