ఐకానిక్ 'పెద్ది' లుక్ తో ఏరువాక వేడుకలు.. అక్కడ చరణ్ మ్యానియా కంటిన్యూ!
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ఇప్పుడు పెద్ది మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ఇప్పుడు పెద్ది మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు.
ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ అయితే వేరే లెవెల్. అందులో చరణ్ గల్లీ క్రికెటర్ గా కనపడగా.. ఆయన ఐకానిక్ షాట్ అండ్ లుక్ ఫుల్ వైరల్ గా మారింది.
ఇప్పుడు అదే లుక్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ సందడి చేశారు. కర్నూలు జిల్లా గుడికల్ ప్రాంత అభిమానులు పెద్దిలోని ఐకానిక్ లుక్ ను ధరించి ఏరువాక పౌర్ణమి ఘనంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ రేంజ్ లో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఏజ్ తో సంబంధం లేకుండా అనేక మంది రామ్ చరణ్ ఫ్యాన్స్.. ఒకే లాంటి షర్ట్స్ వేసుకుని బ్యాట్ లు పట్టుకుని సందడి చేశారు. చరణ్ ఐకానిక్ బ్యాట్ షాట్ ను ఇమిటేట్ చేసి వినూత్నంగా ఏరువాక చేరుకున్నారు. అయితే ఆ వీడియో సూపర్ గా ఉందని, హీరో క్రేజ్ అండ్ మ్యానియా అంటే అలా ఉండాలని ఫ్యాన్స్ అంటున్నారు.
అయితే ఇప్పటికే గుడికల్ ప్రాంత అభిమానులు.. పలుమార్లు చరణ్ ఐకానిక్ లుక్స్ తో ఏరువాక పౌర్ణమి జరుపుకున్న విషయం తెలిసిందే. గతంలో గేమ్ ఛేంజర్, ఆర్ ఆర్ ఆర్ సినిమాల్లోని చరణ్ లుక్స్ ను ధరించి సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ప్రతి రైతు ఏరువాక పౌర్ణమి ఆనందంగా జరుపుకుంటారు. ఎండాకాలం తర్వాత వ్యవసాయం ప్రారంభానికి ముందు సూచికగా, పొలాల్లో పంటలు బాగా పండాలని కోరుతూ పండుగలా చేసుకుంటారు. ఎడ్లకు రంగులద్ది, డెకరేట్ చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ విధంగానే ఇప్పుడు గుడికల్ ప్రాంత వాసులు.. రామ్ చరణ్ వేషధారణలో సందడి చేశారు.