• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్‌ఆర్‌ఆర్‌ కి 300, గేమ్...

ఆర్‌ఆర్‌ఆర్‌ కి 300, గేమ్ ఛేంజర్‌ కోసం 190..!

| రామ్‌ చరణ్ హీరగా శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By - Tupaki Desk
Update: 2024-12-28 05:21 GMT

రామ్‌ చరణ్ హీరగా శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి సీజన్‌లో రాబోతున్న మూడు సినిమాల్లో అతి పెద్ద సినిమాగా, క్రేజీ మూవీగా గేమ్‌ ఛేంజర్ నిలిచింది. సంక్రాంతి సీజన్‌లో రాబోతున్న సినిమాల్లో మొదట రాబోతున్న సినిమా ఇదే కనుక ఎక్కువ స్థాయిలో థియేటర్లు లభించే అవకాశాలు ఉన్నాయి. కనుక భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో మొన్నటి వరకు కాస్త అనుమానాలు ఉన్నాయి. కానీ టీజర్ విడుదల తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరిగింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత రామ్‌ చరణ్ మధ్యలో ఆచార్య సినిమాలో గెస్ట్‌గా నటించాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇదే కావడం విశేషం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం రామ్‌ చరణ్ ఏకంగా 300 రోజుల పాటు డేట్లు కేటాయించారు. అందులో 35 రోజులు ఎంట్రీ సీన్‌ కోసం కేటాయించడం జరిగింది. రామ్‌ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో ఆయన పాత్ర కోసం చరణ్ ఎంత కష్టమైనా పడుతాడు అనేందుకు గేమ్‌ ఛేంజర్‌ మరో ఉదాహరణగా నిలుస్తుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గేమ్‌ ఛేంజర్ కోసం ఆయన అత్యధిక రోజుల డేట్లు కేటాయించారు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్‌ ఛేంజర్‌ సినిమా కోసం రామ్‌ చరణ్ దాదాపుగా 190 రోజుల డేట్లను కేటాయించడం జరిగింది. శంకర్‌ ఈ సినిమాను దాదాపు రెండున్నర ఏళ్లు రూపొందించారు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ పూర్తి చేశారు. రామ్‌ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆ రెండు పాత్రలనూ చాలా విభిన్నంగా చూపించడం కోసం మేకప్ ఆర్టిస్టులు ఎక్కువ సమయం తీసుకునే వారు. అందువల్ల సినిమా కోసం చరణ్ ఎక్కువ రోజులు టైం స్పెండ్‌ చేయాల్సి వచ్చిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తండ్రి పాత్రలో నటించిన చరణ్‌ కి జోడీగా తెలుగు అమ్మాయి అంజలి నటించింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఎస్‌ జే సూర్య పాత్రను తెలుగు ప్రేక్షకులు రాబోయే పదేళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారు అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ దర్శకుడు శంకర్‌ తో పాటు ప్రతి ఒక్కరు ధీమాతో ఉన్నారు. తమన్‌ అందించిన సంగీతం ఇప్పటికే సినిమా స్థాయిని పెంచింది. ప్రముఖ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు కథను ఇవ్వడం ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు.

Tags:    
  • Rajamouli 
  • Ramcharan 
  • Gamechangermovie 
  • RRR 
  • Shankar 
  • NTR 
  • Anjali 
  • Kiaraadvani 
  • Tollywood 
  • Karthiksubbaraju 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS