పిక్ టాక్ : కొంటె చూపులతో చంపేస్తుంది

కెరటం సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. మొదటి సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు

Update: 2024-05-22 10:21 GMT

కెరటం సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. మొదటి సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అయితే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమా తో మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో దాదాపు అందరికీ జోడీగా ఈ అమ్మడు నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాల్లో ఈ అమ్మడికి ఆఫర్లు రావడం లేదు. బాలీవుడ్‌ లో ఒక ఏడాది పాటు ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అవి కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి. దాంతో మళ్లీ ఈమె సౌత్‌ లో సినిమాల కోసం ప్రయత్నాలు చేసింది. కానీ వర్కౌట్‌ అవ్వలేదు.

సినిమా ఆఫర్లు తగ్గడంతో తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్‌ గా అందాల ఆరబోత చేస్తూ అలరిస్తూ ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు కొంటె చూపులతో కవ్విస్తూ క్లీవేజ్ షో తో మతి పోగొట్టే అందాల ఫోటో షూట్‌ ను షేర్‌ చేసింది.

ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఎక్స్‌ప్రెషన్స్‌ ఈ అమ్మడి సొంతం అని పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. తాజా ఫోటో షూట్‌ లో కూడా ఎక్స్‌ ప్రెషన్స్ తో చంపేస్తుంది. ఈ స్థాయి అందాల విందు కేవలం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు మాత్రమే సాధ్యం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఇదే స్థాయిలో అందాల ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఏదో ఒక భాష లో ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా అవకాశాలు రావచ్చు అనేది కొందరి మాట. మరి ఈ అమ్మడు రాబోయే రోజుల్లో మళ్లీ బిజీ అయ్యేనా అంటే.. ఈ ఫోటోలు చూసిన వారు కచ్చితంగా రకుల్‌ కి మంచి రోజులు వస్తాయి అంటున్నారు.

Tags:    

Similar News