పిక్‌టాక్ : కవర్‌ పేజ్‌పై స్టైలిష్ అందాల రకుల్‌

తాజాగా సిటీ షోస్టాపర్స్ కోసం ఫోటో షూట్‌తో అలరించింది. కవర్ ఫోటో స్టిల్‌తో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చూపు తిప్పనివ్వడం లేదు.;

Update: 2025-04-12 12:45 GMT

టాలీవుడ్‌లో 'కెరటం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అంతకు ముందు కన్నడంలో గిల్లి సినిమాలో నటించడం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో టాలీవుడ్‌ వైపు అడుగులు వేసింది. తెలుగులో మొదటి సినిమా కెరటం పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేదు. అయినా 2013లో సందీప్ కిషన్ హీరోగా నటించిన 'వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటనకు మంచి మార్కులు దక్కాయి. అందుకే టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చాయి.

 

టాలీవుడ్‌లో దాదాపు ఆరు ఏడు సంవత్సరాల పాటు వరుసగా సినిమాల్లో నటించడం ద్వారా ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌గా, టాప్‌ హీరోయిన్‌గా నిలిచింది. సౌత్‌లో ఒకానొక సమయంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్స్‌ జాబితాలో నిలిచింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు, అత్యధికంగా స్టార్‌ హీరోల సినిమాలను చేసిన ఘనత కూడా ఈ అమ్మడు సొంతం చేసుకుంది. ఒకానొక సమయంలో మహేష్‌ బాబుతో సినిమాకు సైతం డేట్లు ఇవ్వలేక పోయేంత బిజీగా సినిమాలు చేసింది. ప్రస్తుతం సౌత్‌ సినిమాల్లో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోతున్న రకుల్‌ బాలీవుడ్‌లో మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తోంది.

 

గత ఏడాది తమిళ్‌లో ఈమె నటించిన అయలాన్‌, ఇండియన్ 2 సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ ఏడాదిలో మేరే హస్బెండ్ కీ బివి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ప్రస్తుతం ఈమె దే దే ప్యార్‌ దే 2 సినిమాలో నటిస్తోంది. గతంలో ఈమె నటించిన దే దే ప్యార్‌ దే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఒక హిందీ సినిమాలో నటిస్తోంది. సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రాకపోయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఏకంగా 24 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. రెగ్యులర్‌గా ఈమె ఫోటోలు వీడియోలు షేర్ చేయడం ద్వారా అభిమానులను అలరిస్తోంది.

 

తాజాగా సిటీ షోస్టాపర్స్ కోసం ఫోటో షూట్‌తో అలరించింది. కవర్ ఫోటో స్టిల్‌తో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చూపు తిప్పనివ్వడం లేదు. సన్నగా నాజూకుగా అందంగా కనిపిస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈమధ్య కాలంలో ఆఫర్లు సొంతం చేసుకోలేక పోవడం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విభిన్నమైన ఔట్‌ ఫిట్‌లో సిటీ షోస్టాపర్స్ కోసం రకుల్‌ అందమైన ఫోటో షూట్ స్టిల్స్‌ ను షేర్ చేసింది. రకుల్‌ ప్రీత్ సింగ్‌ బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా హిట్స్ పడటం లేదు. సౌత్‌లో పెద్దగా ఈ అమ్మడు ఆఫర్లను సొంతం చేసుకోలేక పోతుంది. అయినా కూడా ఈ అమ్మడికి సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటో షూట్స్ కారణంగా ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉంది.

Tags:    

Similar News