సమ్మర్ మొదలవకనే.. హీట్ పెంచేస్తోన్న డింపుల్ హయతి!
ఇప్పటికే తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో డింపుల్ హయతి కూడా ఒకరు.;
ఒకవైపు సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరొకవైపు అభిమానులను ఆకట్టుకోవడానికి గ్లామర్ విందు వడ్డిస్తున్నారు హీరోయిన్స్. అందులో భాగంగానే వెకేషన్ ఏదైనా సరే సందర్భం లేకపోయినా సరే ఇలా గ్లామర్ వలకబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. మరి కొంతమంది తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా గ్లామర్ విందు వడ్డిస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. తమ సినిమాపై అంచనాలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో డింపుల్ హయతి కూడా ఒకరు.
అందంతో , అభినయంతో ఆకట్టుకుంటూ స్వతంత్రంగా ఇండస్ట్రీలో ఒక స్థాయికి ఎదగాలని ప్రయత్నిస్తున్న ఈ సెలబ్రిటీ కిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2017లో గల్ఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె యురేకా, అభినేత్రి 2 వంటి చిత్రాలలో నటించింది..కానీ 2019లో మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దెలకొండ గణేష్ సినిమాలో "జర్ర జర్ర" అనే స్పెషల్ సాంగ్ చేసి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక తర్వాత ఖిలాడి సినిమాతో మరో విజయాన్ని అందుకున్న ఈమె.. రామబాణం సినిమా చేసి రెండేళ్లు ఇండస్ట్రీకి దూరమయింది.
మళ్లీ ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాను ఇండస్ట్రీ పెద్ద దివంగత దర్శక ధీరుడు దాసరి నారాయణరావు మనవరాలు అని , ప్రముఖ సీనియర్ నటీమణి ప్రభ తనకు నానమ్మ అవుతుందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. పోతే ఇన్ని రోజులు ఈ విషయాన్ని బయట పెట్టని ఈమె సడన్గా ఈ సినిమా ప్రమోషన్స్ లో తన బ్యాగ్రౌండ్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న డింపుల్ హయతి తాజాగా మరోసారి అందాలు ఆరబోస్తూ హీట్ పెంచిందని చెప్పాలి .ఇక మహాశివరాత్రి అయిపోయిందో లేదో ఇంకా సమ్మర్ మొదలు కాలేదు అప్పుడే తన అందాలతో హీట్ పుట్టిస్తూ అభిమానులను రెచ్చగొడుతోంది. తాజాగా బ్లూ కలర్ చీర కట్టుకున్న ఈమె.. అందులో తన అందాలను ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక అమ్మడి గ్లామర్ కి అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా పలు రకాల కామెంట్లు చేస్తూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.
డింపుల్ హయతి తెలుగు, తమిళ్ , హిందీలో సినిమాలు చేయడమే కాకుండా అటు కన్నడ లో కూడా అరంగేట్రం చేసి తన డెబ్యూ సినిమాతో అక్కడ కూడా మంచి పేరు దక్కించుకుంది. ఇక ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే ఇటు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది డింపుల్ హయతి.