రజనీకాంత్‌ సరదా వ్యాఖ్యలు... సీరియస్‌ టర్న్‌!

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఏ విషయంలో అయినా ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు.;

Update: 2025-07-12 23:30 GMT

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఏ విషయంలో అయినా ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏం మాట్లాడినా ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటుంది. ఆయన ఎంతో జాగ్రత్తగా మాట్లాడినా కూడా ఏదో ఒక సమయంలో వివాదాస్పదం అవుతూ ఉంటుంది. ఆయన కొన్ని వారాల క్రితం ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. ఆ సమయంలో చాలా మంది రజనీకాంత్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. దాంతో రజనీకాంత్‌ మరింత జాగ్రత్తగా మాట్లాడాలని భావించినట్లు ఉన్నాడు. అందుకే తాజాగా 'వేల్పారి' పుస్తకం సక్సెస్‌ కార్యక్రమంలో రజనీకాంత్‌ ఆచితూచి మాట్లాడాడు. అయితే ఆ వ్యాఖ్యలను కూడా కొందరు తప్పుబడుతున్నారు.

ప్రముఖ రచయిత వెంకటేశన్‌ రచించిన వేల్పారి పుస్తకంకు పాఠకుల నుంచి మంచి స్పందన లభించింది. అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల జాబితాలో ఈ పుస్తకం నిలవడంతో ప్రత్యేక కార్యక్రమం ను నిర్వహించారు. రచయిత ఎస్‌ వెంకటేశన్‌ ను అభినందిస్తూ రజనీకాంత్‌ స్పీచ్‌ సాగింది. అయితే ఈ స్పీచ్‌లో రజనీకాంత్‌ హ్యూమర్‌ను యాడ్‌ చేశారు. 75 ఏళ్ల వయసులో కూలింగ్‌ గ్లాస్ పెట్టుకుని స్లో మోషన్‌లో నడిచే నన్ను ఎందుకు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా ఆహ్వానించారో నాకు అర్థం కాలేదు అన్నారు. రజనీకాంత్‌ వ్యాక్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కమల్‌ హాసన్‌ ప్రస్థావన రావడంతో మరింతగా ఈ విషయం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.

రజనీకాంత్‌ మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించడం సరి కాదు. ఇలాంటి సాహిత్య సమావేశాలకు కమల్‌ హాసన్‌ లేదా శివ కుమార్‌ వంటి మేధావులను ఆహ్వానించాలి అన్నాడు. ఇటీవల కమల్‌ హాసన్‌ తన సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ కన్నడ భాషను తక్కువ చేసినట్లుగా మాట్లాడుతూ తమిళ్‌ భాష గొప్పతనంను గురించి మాట్లాడాడు అంటూ వివాదం చెలరేగింది. కన్నడంలో ఏకంగా కమల్‌ హాసన్‌ సినిమాను బ్యాన్‌ చేశారు. సాహిత్యం గురించి కమల్‌ హాసన్‌ మాట్లాడాలి అంటూ రజనీకాంత్‌ అన్నాడు అంటే ఇటీవల ఆయన కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అని ఉంటాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

పుస్తకంకు సంబంధించిన కార్యక్రమంలో రజనీకాంత్‌ చేసిన సరదా వ్యాఖ్యలు కాస్త కాస్త సీరియస్‌ టర్న్‌ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్‌ హాసన్‌ను సున్నితంగా రజనీకాంత్‌ విమర్శించినట్లుగా అనిపిస్తుందని కొందరు ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. రజనీకాంత్‌ స్థాయి స్టార్‌ అలాంటి వ్యాఖ్యలు చేయడని, అంతే కాకుండా కమల్‌ హాసన్ అంటే రజనీకాంత్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని అందరికీ తెలుసు. కనుక ఆయన సదుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని, అందులో వ్యంగ్యంను కొందరు కావాలని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సోషల్‌ మీడియాలో రజనీకాంత్‌ ఫ్యాన్స్ కొందరు డ్యామేజ్ కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ముందు ఇది ఏ టర్న్‌ తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News