ఫామ్ లో లేని డైరెక్టర్‌తో తలైవా మూవీ?
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమా యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు సృష్టిస్తోంది.;
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమా యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు ప్రీమియర్లు లేట్ గా పడుతునా, ఐమాక్స్ స్క్రీన్స్ లేకపోయినా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ సేల్స్ లో చాలా స్థిరమైన బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే కూలీ కి మిగిలిన ఏరియాల్లో కూడా ఈ రేంజ్ బుకింగ్సే ఉండేట్టు కనిపిస్తుంది.
కూలీ తర్వాత జైలర్2
ఆగస్ట్ 14న కూలీ సినిమా రిలీజ్ కానుంది. అదే రోజున హృతిక్ రోషన్- ఎన్టీఆర్ కలిసి నటించిన వార్2 సినిమా రిలీజవుతున్నప్పటికీ ఇప్పటికైతే వార్2 కంటే కూలీపైనే మంచి బజ్ నెలకొంది. కూలీ లో నటిస్తున్న తారాగణంతో పాటూ ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండటం కూలీపై అంచనాలను పెంచింది. కూలీ2 ని ఎప్పుడో పూర్తి చేసిన రజినీ ప్రస్తుతం జైలర్2 షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
జైలర్2 తర్వాత ఏంటి?
చూస్తుంటే కూలీ, జైలర్2 తో రజినీ బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే జైలర్2 తర్వాత సూపర్ స్టార్ ఎవరితో సినిమా చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే డైరెక్టర్ నిథిలన్ సామినాథన్, హెచ్. వినోద్, వివేక్ ఆత్రేయ లాంటి పేర్లు వినిపించడంతో వీరిలో ఎవరో ఒకరితో రజినీ సినిమా చేస్తారనుకున్నారంతా.
బరిలోకి కొత్త పేరు
అయితే ఇప్పుడు వారందరినీ కాదని మరో డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. అతనే సిరుత్తై శివ. రజినీకాంత్ త్వరలోనే సిరుత్తై శివ దర్శకతంలో ఓ సినిమా కోసం జత కట్టే అవకాశాలున్నాయని, ప్రారంభ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ కాంబినేషన్ పట్ల ఫ్యాన్స్ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.
ఫామ్ లో లేకపోయినా..
గత కొన్ని సినిమాలుగా సిరుత్తై శివ ఫామ్ లో లేరు. అతన్నుంచి ఆఖరిగా వచ్చిన కంగువా సినిమా కోలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. కంగువా సినిమా విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న శివ ఇప్పుడు రజినీతో సినిమా చేస్తే అది వారిద్దరి కాంబినేషన్ లో రాబోయే రెండో సినిమా అవుతుంది. ఇప్పటికే వారిద్దరూ గతంలో అన్నాత్తే సినిమాకు వర్క్ చేశారు. ఆ సినిమా కూడా తీవ్ర విమర్శలు అందుకున్న విషయం తెలిసిందే. శివ ఫామ్ లో లేని విషయం తెలిసి కూడా రజినీ ఈ సినిమాకు ఎలా ఒప్పుకున్నారా అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుండగా, ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని తెలుస్తోంది.