నోల‌న్ 'డ‌న్ కిర్క్‌'లాంటి వార్ డ్రామాను వ‌దులుకున్న ర‌జ‌నీ!

ప్ర‌స్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దురంధ‌ర్ లాంటి ప్ర‌త్యేక‌త ఉన్న సినిమాల‌ను ప్ర‌జ‌లు ఆద‌రించారు.

Update: 2026-06-28 06:30 GMT

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఎందుకు అంత గుడ్డిగా వ్య‌వ‌హ‌రించారు? ఆయ‌న అనుభ‌వం అంతా వృథా అయింది! ఇదీ సోష‌ల్ మీడియాల్లో తాజా డిబేట్. ద‌ర్శ‌కుడు సిబి చ‌క్ర‌వర్తి నోల‌న్ `డ‌న్ కిర్క్` రేంజ్ స్క్రిప్టు చెబితే..! అశ్వ‌త్ మారిముత్తు చెప్పిన రొటీన్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామాను ఎందుకు ఓకే చేశారు? అంటూ పెద్ద డిబేట్ మొద‌లైంది.

ఓల్డ్ స్టైల్ క్లాసిక్ డే డైరెక్ట‌ర్ సుంద‌ర్ సి సంగ‌తి అటుంచితే సిబి చ‌క్ర‌వ‌ర్తి చెప్పిన నేటిత‌రం ట్రెండీ స్క్రిప్ట్ ను, నేటి గ్లోబ‌ల్ మార్కెట్ గుర్తించే స్క్రిప్టును కాద‌ని అన‌డం ఏమిటో అర్థంగాక నెటిజ‌నులు గంద‌ర‌గోళంలో ప‌డ్డారు. వైవిధ్య‌మైన క‌థాంశాన్ని ప‌క్క‌న‌బెట్టేయాల‌ని ర‌జ‌నీకి ఎందుకు అనిపించిందో అర్థం కావ‌డం లేద‌ని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. నోలాన్ డ‌న్ కిర్క్- ఓపెన్ హీమ‌ర్ రేంజు స్క్రిప్టును వినిపిస్తే దానిని కాద‌ని, న‌ర‌సింహా- రాఘ‌వ‌న్ లాంటి లోక‌ల్ స్క్రిప్టును ఓకే చేసారేమిటి? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

మూడవ ప్ర‌పంచ యుద్ధం, అణ్వాయుధ ప్ర‌యోగం వంటి అడ్వాన్స్ డ్ థింకింగ్ ఉన్న ఒక స్క్రిప్టును చెప్పిన‌ప్పుడు ర‌జ‌నీకాంత్ దానిలోని కొత్త‌ద‌నాన్ని స్వీక‌రించ‌లేక‌పోయారా? లేక మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వ‌ల్ల ప్ర‌పంచ దేశాల‌కు ప్ర‌యాణ‌మ‌వ్వ‌డం ఇష్టం లేక మ‌రో రొటీన్ అశ్వ‌త్ మారిముత్తు స్క్రిప్టును ఓకే చేసేసారా? అంటూ పెద్ద డిబేట్ ర‌న్ అవుతోంది. అశ్వ‌త్ తెర‌కెక్కించే ధ‌ర్మ‌న్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇది కూడా మ‌రో రొటీన్ సినిమా స్క్రిప్టు అన్న చ‌ర్చా సాగింది. ఇప్పుడు సౌత్ ఆడియెన్ కి కానీ, పాన్ ఇండియా మార్కెట్‌కి కానీ, ఇలాంటి ఒక రొటీన్ స్క్రిప్టు అవ‌స‌రం లేదు. ఏదైనా గ‌మ్మ‌త్త‌యిన‌ది.. లేదా కొత్త‌గా ఉండే భారీత‌నం నిండిన స్క్రిప్టు మాత్ర‌మే కావాలి. సిబి చక్ర‌వ‌ర్తి ఏకంగా క్రిస్టోఫ‌ర్ నోలాన్ డ‌న్ కిర్క్ (రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలోని ఒక ఘ‌ట్టం ఆధారంగా తీసారు) రేంజు, అంత‌కంటే అడ్వాన్స్ డ్ థింకింగ్ ఉన్న స్టోరీని నేరేట్ చేసార‌ని అర్థ‌మ‌వుతోంది. కానీ ర‌జ‌నీ దీనిని తిర‌స్క‌రించారు. ఆఫ్ఘ‌న్ స‌రిహ‌ద్దులు, ర‌ష్యా వంటి చోట్ల చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాలి అన‌గానే దానికి ర‌జ‌నీ సుముఖ‌త చూపించ‌లేద‌ట‌.

ప్ర‌స్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దురంధ‌ర్ లాంటి ప్ర‌త్యేక‌త ఉన్న సినిమాల‌ను ప్ర‌జ‌లు ఆద‌రించారు. ఇలాంటి స‌మ‌యంలో అణ్వాయుధం- వార్ బ్యాక్ డ్రాప్ సినిమా అంటే దేశం మొత్తం ఆ సినిమా గురించే ఎదురు చూసేది. ఇది స‌రైన టైమింగుతో చేస్తున్న ప్ర‌య‌త్నంగా కనిపించేది. కానీ కొత్త‌ద‌నానికి స్కోప్ లేకుండా పోయింద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ర‌జ‌నీ కెర‌ర్ జ‌ర్నీ మొత్తం ఎన్నో వైవిధ్య‌మైన స్క్రిప్టుల‌కు ఓకే చెప్పారు. కానీ కీల‌క‌మైన స‌మ‌యంలో ఇలాంటి ఒక మంచి స్క్రిప్టును తిర‌స్క‌రించార‌న్న చ‌ర్చా వేడెక్కించేస్తోంది.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై నెగెటివిటీ ఎలా ఉన్నా.. రజినీ-కమల్ కాంబినేషన్ క్రేజ్ వల్ల ట్రేడ్ వర్గాల్లో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ డాక్ట‌ర్ ధర్మన్ థియేటర్లలోకి వచ్చి ట్రోలర్స్‌కు ఎలాంటి సమాధానం చెప్తాడో చూడాలి.

Tags:    

Similar News