• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇన్నేళ్ల ఎక్స్ పీరియన్స్...

ఇన్నేళ్ల ఎక్స్ పీరియన్స్ ఏమి పని చేయట్లేదా..?

| ఒకప్పుడు హీరోగా అదరగొట్టిన కొందరు అప్పట్లో స్టార్ క్రేజ్ ఉన్నా ఆ తర్వాత తమ గ్రాఫ్ పడిపోయిందని గుర్తించి సైలెంట్ అయిపోయారు.

By - Tupaki Desk
Update: 2024-04-26 09:30 GMT

ఒకప్పుడు హీరోగా అదరగొట్టిన కొందరు అప్పట్లో స్టార్ క్రేజ్ ఉన్నా ఆ తర్వాత తమ గ్రాఫ్ పడిపోయిందని గుర్తించి సైలెంట్ అయిపోయారు. సోలో సినిమాల వల్ల లాభం లేదని గుర్తించిన కొందరు కెరీర్ గ్యాప్ ఇచ్చి స్పెషల్ రోల్స్, ప్రతి నాయకుడి పాత్రల్లో రాణిస్తున్నారు. అయితే ఒకప్పుడు వారికి ఉన్న స్టార్ డం ఇప్పుడు వారు చేస్తున్న సినిమాలకు ఉపయోగపడుతుంది. అయితే అందరికీ అలా వర్క్ అవుట్ అవుతుందా అంటే కాదనే చెప్పాలి. సీనియర్ హీరోల్లో జగపతి బాబు హీరోగా ఫేడవుట్ అవ్వడం కెరీర్ గ్యాప్ తీసుకోవడం తెలిసిందే.

కానీ లెజెండ్ తో అతను విలన్ గా టర్న్ అవ్వడంతో కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఒకప్పుడు హీరో ఇమేజ్ అతను విలన్ గా చేసిన సినిమాలకు ప్లస్ అయ్యింది. విలన్ గా టర్న్ అయ్యాక జగపతి బాబు దాదాపు 90 సినిమాల దాకా చేశాడని తెలిసిందే. ఇదే దారిలో ఒకప్పటి హీరో శ్రీకాంత్ కూడా సోలో సినిమాలు వర్క్ అవుట్ అవ్వట్లేదని గుర్తించి ఆ ప్రయత్నాలు ఆపేశాడు. స్పెషల్ రోల్స్ చేస్తున్నా కూడా సరైన గుర్తింపు రావట్లేదు. ఒకటి రెండు సినిమాల్లో ప్రతి నాయకుడిగా కూడా శ్రీకాంత్ చేశాడు కానీ అది కూడా వర్క్ అవుట్ కాక సైలెంట్ గా ఉన్నాడు.

ఇక ఇప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ వంతు వచ్చింది. మొన్నటిదాకా సోలో సినిమాలు చేయాలని ఆరాటపడిన రాజశేఖర్ తనకు మార్కెట్ పడిపోయిందన్న విషయాన్ని గ్రహించాలి. అయితే తనకున్న మాస్ ఇమేజ్ తో స్పెషల్ రోల్స్ చేస్తే కచ్చితంగా కెరీర్ కొంత ఊపందుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలోనే నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాలో రాజశేఖర్ స్పెషల్ రోల్ చేశారు. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన్ను పట్టించుకోలేదు.

లేటెస్ట్ గా శర్వానంద్ సినిమాలో ఈసారి ఏకంగా తండ్రి పాత్రలో రాజశేఖర్ నటిస్తున్నారట. సినిమాలో ఆయన పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. స్పెషల్ రోల్స్ చేసినా ఒక్క సక్సెస్ పడితే కచ్చితంగా మళ్లీ రాజశేఖర్ తిరిగి ఫాంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రాజశేఖర్ ఇన్నేళ్ల అనుభవం ఆయన సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చేందుకు సహకరించట్లేదు. అయితే సోలోగా ఎలాగు కష్టమని ఫిక్స్ అయ్యారు కాబట్టి క్రేజీ కాంబినేషన్స్, వెరైటీ ఎక్స్ పెరిమెంట్స్ చేస్తే మాత్రం రాజశేఖర్ సక్సెస్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. మరి యాంగ్రీ యంగ్ మ్యాన్ సినిమా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఆయన తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది.

Tags:    
  • Rajasekhar 
  • Movies 
  • Tollywood 
  • Srikanth 
  • Jagapathibabu 
  • Nithiin 
  • Extraordinaryman 
  • Sharwanandh 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS