• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  35 ఏళ్ల తర్వాత మళ్లీ...

35 ఏళ్ల తర్వాత మళ్లీ 'మగాడు' గా రాజశేఖర్‌..!

| మల్కాపురం శివ కుమార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ను ఇదే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-28 14:30 GMT

సీనియర్ హీరో రాజశేఖర్‌ గతంలో మాదిరిగా వరుస సినిమాలు చేయడం లేదు. హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా చేసేందుకు సిద్ధం అంటూ ఇప్పటికే ప్రకటించి ఒకటి రెండు సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి నటించిన రాజశేఖర్‌ హీరోగా మరో ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్‌ సాదినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. మల్కాపురం శివ కుమార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ను ఇదే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు విభిన్నమైన టైటిల్‌ ను దర్శకుడు పవన్ సాదినేని పరిశీలిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. 'మగాడు' అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ ను రాజశేఖర్‌ కోసం దర్శకుడు అనుకుంటున్నాడట. 35 ఏళ్ల క్రితం రాజశేఖర్‌ హీరోగా మగాడు సినిమా వచ్చింది. కే మధు దర్శకత్వంలో రూపొందిన మగాడు సినిమాలో హీరోయిన్‌ గా జీవిత నటించింది. లిస్సీ, మురళి మోహన్‌, శరత్‌ కుమార్‌ లు కీలక పాత్రల్లో నటించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రాజశేఖర్‌ అదే టైటిల్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇప్పటి వరకు రాజశేఖర్‌ మూవీకి 'మగాడు' టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా యూనిట్‌ సభ్యుల నుంచి క్లారిటీ రాలేదు. ఒకటి రెండు వారాల్లో ఆ విషయమై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎన్నో యాక్షన్ సినిమాలను, కమర్షియల్‌ సినిమాలను చేసిన రాజశేఖర్‌ మరోసారి అదే తరహా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజశేఖర్‌ తో పాటు ఇతర ముఖ్య నటీనటుల తో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారని తెలుస్తోంది. రాజశేఖర్‌ ఫ్యాన్స్ తో పాటు ఆయన సన్నిహితులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలో రాజశేఖర్‌ నటించాడు. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో రాజశేఖర్ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. పవన్ సాదినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమా హిట్‌ అయితే రాజశేఖర్‌ వరుసగా హీరోగానే సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పాత సినిమాలను రీమేక్ చేయడం లేదంటే రీ రిలీజ్ చేయడం ద్వారా స్టార్‌ హీరోలు వార్తల్లో ఉంటున్నారు. అయితే రాజశేఖర్ మాత్రం తన సినిమా టైటిల్‌ ను తన కొత్త సినిమా తో రావడం వల్ల వార్తల్లో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • Rajasekhar 
  • Pawansadineni 
  • Tollywood 
  • Magaadu 
  • Filmindustry 
  • Rajasekharmagaadu 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

Copyright @2026

Powered by Blink CMS