'ఫ్యామిలీమ్యాన్ 3' మొద‌లెట్టిన రాజ్ & డీకే

తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే తీపి క‌బురు చెప్పారు. ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌క‌ద్వ‌యం `ఫ్యామిలీమ్యాన్` సీజ‌న్ 3 స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

Update: 2024-05-06 09:25 GMT

తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే తీపి క‌బురు చెప్పారు. ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌క‌ద్వ‌యం `ఫ్యామిలీమ్యాన్` సీజ‌న్ 3 స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ మూడవ సీజన్ చిత్రీకరణ కోసం అన్ని ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తోంది. ఈ ఫ్రాంఛైజీలో సీజ‌న్ 1, సీజ‌న్ 2 ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించాయి. రాజ్ & DK వారి బ్యానర్ D2R ఫిలిమ్స్ లో ఇప్పుడు సీజ‌న్ 3ని కూడా తెర‌కెక్కిస్తున్నారు. యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ లో సీజన్ 2 క్లైమాక్స్ విస్తృతమైన ప్రశంసలను పొందింది. కొన‌సాగింపు అంత‌కంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది. సీజ‌న్ 3 ప్రస్తుతం ఉత్పత్తి ద‌శ‌లో ఉంది. ఇది విడుదలైన తర్వాత 240కి పైగా దేశాలు , భూభాగాల్లోని ప్రైమ్ మెంబర్‌లకు అద్భుత‌మైన థ్రిల్‌ని అందిస్తుంద‌ని చెబుతున్నారు.

మనోజ్ బాజ్‌పేయ్ కొత్త‌ సీజన్‌లో రహస్య గూఢచారి శ్రీకాంత్ తివారీగా తన పాత్రను తిరిగి పోషిస్తారు. శ్రీకాంత్ ఒక మధ్యతరగతి అధికారి.. ప్రపంచ స్థాయి గూఢచారిగా తిరిగి తెర‌పైకి వ‌స్తున్నాడు. జాతీయ భద్రత సంక్లిష్టతలను ప‌రిశోధిస్తూ.. అత‌డు తన కుటుంబ జీవితాన్ని కొనసాగించడం .. భార్యతో తన సంబంధాన్ని సరిదిద్దుకోవడం వంటి సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మునుపెన్నడూ లేనంత బ‌ల‌మైన‌ ప్రత్యర్థితో ఈసారి శ్రీకాంత్ ఢీకొంటాడు. తన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ..త‌న‌కు పొంచి ఉన్న బెదిరింపులను ప్ర‌మాదాల‌ను ఎదుర్కోవడానికి శ్రీ‌కాంత్ తివారీ కాలంతో పాటు పోటీప‌డాల్సి ఉంటుంది.

Read more!

రాజ్ & DK దూరదృష్టితో కూడిన క‌థా ర‌చ‌న‌లో, దర్శకత్వంలో తిరుగు లేని నిష్ణాతులు. రాజ్ & DK తో చేరిన సుమ‌న్ కుమార్ సృజనాత్మక ఇన్‌పుట్‌తో `ది ఫ్యామిలీ మ్యాన్` సీజన్ 3 ప్రేక్షకులను మ‌రింత‌గా రంజింప‌జేస్తుందని తెలిసింది. ప్రియమణి, షరీబ్ హష్మీ, ఆశ్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా త‌దిత‌రులు ఇందులో తిరిగి న‌టిస్తారు. వీరితో పాటు కొత్త‌ తారలు చిత్ర‌ బృందంలో చేరనున్నారు.ఈ గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్‌లో తదుపరి అధ్యాయం కోసం స‌ర్వ‌త్రా ఆస‌క్తి పెరుగుతోంది. క‌థ‌లో ఊహించని మలుపులు, ట్విస్టులు ప్రేక్ష‌కుల‌ను సీట్ల అంచుపైకి లాగే అవకాశం ఉంది.

Tags:    

Similar News