• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ సినిమాలో...

ఎన్టీఆర్ సినిమాలో భాగమవుతున్న రాజమౌళి కొడుకు!

| యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "దేవర''.

By - Tupaki Desk
Update: 2024-08-03 09:50 GMT

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "దేవర''. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలోనే దేవర పార్ట్-1 కు మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. సెప్టెంబర్ నెలాఖరున రాబోతున్న ఈ మూవీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన వివరాలు ఒక్కటొక్కటిగా బయటకి వస్తున్నాయి.

'దేవర 1' సినిమా డిస్ట్రిబ్యూషన్ లో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ భాగం అవుతున్నారు. ఈ మూవీ కర్ణాటక థియేట్రికల్ పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో తాజాగా ప్రకటించారు. "అతని ఫోర్ట్. అతని ఎదుగుదల. అతని విజయం... అంతా నా తారక్ అన్న ప్రేమ కోసం. దేవర కెవిఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి దేవర చిత్రాన్ని కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది." అని కార్తికేయ పోస్ట్ చేశారు.

రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలకు ఎస్ఎస్ కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. సమ్మర్ లో ‘ప్రేమలు’ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చెయ్యడం ద్వారా డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి అడుగుపెట్టాడు. అలానే రాజమౌళి సమర్పణలో షోయింగ్ బిజినెస్ అనే బ్యానర్ మీద ‘ఆక్సిజన్‌’ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ చిత్రాలను నిర్మిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పుడు 'దేవర-1' మూవీ డిస్ట్రిబ్యూషన్ లో భాగం అవుతుండటం విశేషం.

ఇకపోతే 'దేవర' సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ దక్కించుకున్నారు. తారక్ అన్న నటిస్తున్న ఎపిక్ యాక్షన్ మూవీ పంపిణీలో భాగం అయినందుకు గర్వంగా ఉందని, ప్రపంచమంతటా దేవర పాలన కోసం సిద్ధంగా ఉండమని, ఈ సెప్టెంబర్ 27 నుండి భయానికి కొత్త ముఖం కనిపిస్తుందని నాగవంశీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ కు అభిమాని అయిన నిర్మాత.. గతంలో ఆయనతో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాని నిర్మించారు.

'దేవర' చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్లుగా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, చైత్ర రాయ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, కలైయరసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌ పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Tags:    
  • NTR 
  • Devara 
  • Karthikeya 
  • Tollywood 
  • Movienews 

Similar News

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS