రాజా సాబ్ ఆ టార్గెట్ అందుకుంటాడా..?
అందుకే ఈ సినిమాను కచ్చితంగా ప్రేఖకుల అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. రాజా సాబ్ సినిమాతో మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు.;
రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ చిన్నగా 2026 సంక్రాంతి రేసుకి కన్ఫర్మ్ అయ్యింది. అసలైతే ఈ ఇయర్ సమ్మర్ అదే ఏప్రిల్ లోనే రావాల్సిన ఈ సినిమా దసరాకి వస్తుందని అనుకున్నారు. ఫైనల్ గా డిసెంబర్ 5కి రిలీజ్ లాక్ చేశారు. ఇప్పుడు ఆ డేట్ ని కూడా పుష్ చేస్తూ జనవరి 9, 2026 రిలీజ్ అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాల రిలీజ్ విషయంలో ఈ కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఐతే పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి సరైన టైం రిలీజ్ చేస్తే బెటర్ అనే ప్లాన్ కనిపిస్తుంది.
థ్రిల్లర్ జోనర్ లో రాజా సాబ్..
రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో సంథింగ్ స్పెషల్ మూవీగా వస్తుంది. ఐతే ఈ సినిమా టార్గెట్ మాత్రం చాలా పెద్దగానే ఉందని టాక్. ప్రభాస్ సినిమా మరోసారి 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుందని తెలుస్తుంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ థ్రిల్లర్ సినిమాలో కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో పాటు గూస్ బంప్స్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది.
అందుకే ఈ సినిమాను కచ్చితంగా ప్రేఖకుల అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. రాజా సాబ్ సినిమాతో మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుందట. ఇక మరోపక్క ప్రభాస్ కూడా తన మాస్ స్టామినా ఏంటన్నది చూపించాలని చూస్తున్నాడు.
ఈగర్ గా నార్త్ సైడ్ రెబల్ ఫ్యాన్స్..
ప్రభాస్ రాజా సాబ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. నార్త్ సైడ్ ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ రాజా సాబ్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ కి మరో 1000 కోట్ల కలెక్షన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. ప్రభాస్ కూడా ఈ సినిమాపై సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.
బాహుబలి 2 తో 1000 కోట్లు కలెక్ట్ చేసిన ప్రభాస్ లాస్ట్ ఇయర్ వచ్చిన కల్కి 2898 ఏడితో మళ్లీ 1000 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టాడు. మరి రాజా సాబ్ తో హ్యాట్రిక్ 1000 కోట్లు కొడతాడా లేదా అన్నది చూడాలి.