63 ఏళ్ల వయసులో రాధిక ఓ సాహసం!
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు రాధికాశరత్ కుమార్ అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు.;
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు రాధికాశరత్ కుమార్ అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ రాధిక పని చేసారు. తమిళ చిత్రాలతో మొదలైన ఆమె నట ప్రస్థానం తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమల్లోనూ కొనసాగింది. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం ఆమెది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సత్తా చాటడమే గాక రాజకీయ రంగంలోనూ రాణించారు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేను సొంతం చేసుకున్నారు. అయితే వెండి తెరపై మాత్రం లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు పెద్దగా చేయలేదు.
1980-90 దశకంలో హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనంతరం తర్వాత తరం హీరోలకు మామ్ పాత్రల్లోనూ నటించారు. అలాగే బుల్లి తెరపై కూడా మెరిసారు. అయితే ఇక్కడ మాత్రం సోలోగా సత్తాచాటారు. రాధిక ప్రధాన పాత్రల్లో ఎన్నోర సీరియల్స్ తెరకెక్కాయి. ఈ విషయంలో రాధిక ఓ బ్రాండ్ గానే బుల్లి తెరపై తనదైన ముద్ర వేసారు. విభిన్న పాత్రల్లో బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించారు. అలాగే డేర్ అండ్ డ్యాషింగ్ ఉమెన్ గానూ ఆమెకు గుర్తింపు ఉంది. ఎలాంటి విషయంపైనైనా ఓపెన్ గా మాట్లాడటం ఆమె నైజం. ఈ నేపథ్యంలో తాజాగా రాధిక శరత్ కుమార్ వెండి తెరపై సోలోగానూ సత్తా చాటడానికి సిద్దమయ్యారు.
రాధిక ప్రధాన పాత్రలో `తియికిళవి `అనే చిత్రం తెరకెక్కుతోంది. మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ హీరో శివ కార్తికేయన్ నిర్మిస్తున్నాడు. ఇందులో రాధిక పవునుతాయి అనే రుణాలిచ్చే వృద్దిరాలి పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రలో రాధిక ఆహార్యం ఎంతో వైవిథ్యంగా ఉంది. ముసలి అవ్వగా రాధిక ఆ పాత్రలో ఒదిగిపోయినట్లే కనిపిస్తున్నారు. రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం రాధిక వయసు 63 ఏళ్లు. అయినా వయసు జస్ట్ నెంబర్ మాత్రమేనని ఎంతో యాక్టివ్ గా సినిమాలు చేయడం ఆమె జనరేషన్ నటీమణుల్లో ఆమెకే చెల్లిందనాలి.
రాధ, శోభన, భాను ప్రియ, వాణీ విశ్వనాధ్ ఇలా చాలా మంది నటులున్నా? వాళ్లెవ్వరు ఇండస్ట్రీలో అంత యాక్టివ్ సినిమాలు చేయలేదు. అవకాశాలు వస్తే నటించడం తప్ప తమకు తాముగా అవకాశాలు సృష్టించుకో లేకపో తున్నారు. రాధిక ఇతర సంస్థల్లో పని చేస్తూనే సొంతంగా నిర్మాణ సంస్థను కూడా రన్ చేస్తున్నారు. సినిమాలు.. సీరియల్స్ ఎన్నో నిర్మిస్తున్నారు. సీరియల్స్ డిస్ట్రి బ్యూషన్ లోనూ రాధిక సంస్థకు మంచి పేరుంది.