గోల్డ్ టాసెల్ గౌన్‌లో మెరిసిన రాశీ ఖన్నా!

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా, సినిమాలతోనే కాకుండా ఓటీటీ ప్రపంచంలోనూ తన మార్క్ చూపిస్తోంది.

Update: 2026-05-20 19:17 GMT

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా, సినిమాలతోనే కాకుండా ఓటీటీ ప్రపంచంలోనూ తన మార్క్ చూపిస్తోంది. గతంలో షాహిద్ కపూర్‌తో చేసిన 'ఫర్జీ' సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు సరికొత్త యాక్షన్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఆమె నటించిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్-థ్రిల్లర్ మ్యూజికల్ సిరీస్ ‘లుక్కే’ ప్రమోషన్స్‌లో రాశీ ఖన్నా ధరించిన గోల్డ్ టాసెల్ గౌన్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..ఆ విశేషాలు చూద్దాం..



 


ఓటీటీలో రాశీ ఖన్నా క్రేజ్:

వెండితెరపై కమర్షియల్ సినిమాలతో పాటు మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ చేస్తూ రెండిటినీ బ్యాలెన్స్ చేసింది రాశీ ఖన్నా. అయితే డిజిటల్ స్క్రీన్‌పై కూడా ఆమె ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. 'ఫర్జీ' సక్సెస్ తర్వాత ఆమె డిమాండ్ ఓటీటీలో బాగా పెరిగింది. ఇప్పుడు మరోసారి అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ ‘లుక్కే’తో డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించింది.



 


పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ:

ఈ సరికొత్త వెబ్ సిరీస్ ‘లుక్కే’లో రాశీ ఖన్నా ఒక పవర్‌ఫుల్ పంజాబీ పోలీస్ ఆఫీసర్ 'ఇన్‌స్పెక్టర్ గుర్బానీ' పాత్రలో కనిపించనుంది. ఇక ఎప్పుడూ గ్లామరస్‌గా కనిపించే రాశీ, ఈ సిరీస్‌లో మాత్రం ఫుల్ యాక్షన్ మోడ్‌లో అదరగొట్టింది. డ్రగ్ మాఫియాను అంతం చేసే ఒక ఇంటెన్స్ రోల్‌లో ఆమె నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.



 


ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్:

హిమాంక్ గౌర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో మే 8 నుంచి సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాశీ ఖన్నాతో పాటు ప్రముఖ రేపర్ కింగ్ , పాలక్ తివారీ, లక్ష్వీర్ సింగ్ సరన్, శివాంకిత్ పరిహార్ కీలక పాత్రలు పోషించారు. రాప్ మ్యూజిక్, క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ థ్రిల్లర్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

కళ్ళు చెదిరే గోల్డ్ గౌన్ లుక్:

సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా రాశీ ఖన్నా చేసిన ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లకు తగ్గట్టుగా డిజైన్ చేసిన లగ్జరీ గోల్డ్ అంబ్రే నెట్ బాడీకాన్ గౌన్‌లో రాశీ మెరిసిపోయింది. ఇక ఈ కాస్ట్యూమ్‌కు ఉన్న పూసల లేయర్స్, ఓంబ్రే-టోన్డ్ టాసెల్స్ ఆమె అందాన్ని మరింత పెంచేశాయి. ఈ లుక్‌ను చూసిన అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ "హియర్స్ ఏ స్టన్నర్ టు క్లెన్స్ యువర్ ఫీడ్" అంటూ రాశీ ఫొటోలను షేర్ చేసింది.

ఒకవైపు సిరీస్‌లో రఫ్‌గా ఉండే పోలీస్ పాత్రలో కనిపిస్తూనే.. బయట ప్రమోషన్స్‌లో మాత్రం ఇలాంటి అదిరిపోయే గ్లామరస్ ఫోటోషూట్స్‌తో ‘లుక్కే’ సిరీస్‌కు రాశీ ఖన్నా గట్టి హైప్ తీసుకొచ్చింది. క్యూట్ లుక్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన రాశీ.. ఇప్పుడు ఇలాంటి ఇంటెన్స్ రోల్స్ చేస్తూ ఓటీటీ క్వీన్‌గా దూసుకుపోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు ఫాన్స్.

Tags:    

Similar News