ఇండస్ట్రీలోకి రాకుంటే హీరోయిన్ రాశి ఖన్నా ఏమయ్యేవారో తెలుసా?
రాశి ఖన్నా కెరియర్ విషయానికి వస్తే.. డిగ్రీ చదువుతున్నప్పుడే మోడలింగ్లో అవకాశాలు రావడంతో అలా మోడలింగ్ వైపు వెళ్లిన ఈమె.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.;
చాలా మంది చదువుకునే సమయంలోనే కెరియర్ ను బిల్డ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్ ఇలా పలు రంగాలలో సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. అయితే జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి. పలు కారణాల వల్ల తాము అనుకున్న కలలను కూడా పక్కకు నెట్టి.. వేరే రంగంలో స్థిరపడాల్సి వస్తుంది. అలా ఇప్పటికే ఎంతోమంది ఫలానా ఉద్యోగంలో సెటిల్ అవ్వాల్సింది పోయి ఇండస్ట్రీలోకి వచ్చామంటూ చెప్పుకొచ్చారు కూడా.. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా కూడా చేరిపోయారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతూ దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ఇండస్ట్రీలోకి రాకపోయి ఉండుంటే ఏమయ్యేవారో తెలిసి అందరిని ఆశ్చర్యపోతున్నారు.
హీరోయిన్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారో తెలుసా?
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది రాశి ఖన్నా. 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించిన ఈమె.. చదువులో చిన్నప్పటి నుంచి ముందుండేది. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. డిగ్రీ చదువుతున్నప్పుడే కొన్ని అడ్వర్టైజ్మెంట్ లకు కాపీ రైటింగ్ జాబ్ కూడా చేసింది. మరొకవైపు అకాడమిక్స్ లో టాపర్ గా నిలిచిన ఈమె ఐఏఎస్ ఆఫీసర్ గా మారి అడ్మినిస్ట్రేటివ్ సేవలు అందించాలని కలలు కందట . కానీ ఊహించని విధంగా వచ్చిన సినిమా ఆఫర్లతో కెరియర్ మొత్తాన్ని మార్చేసుకుంది. అలా రాశి ఖన్నా సినిమాలలోకి రాకపోయి ఉండుంటే.. నేడు ఐఏఎస్ ఆఫీసర్గా తన కలను నెరవేర్చుకునేదట. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రాశి ఖన్నా కెరియర్..
రాశి ఖన్నా కెరియర్ విషయానికి వస్తే.. డిగ్రీ చదువుతున్నప్పుడే మోడలింగ్లో అవకాశాలు రావడంతో అలా మోడలింగ్ వైపు వెళ్లిన ఈమె.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనూహ్యంగా మోడలింగ్లో అవకాశాలు రావడం. అట్నుంచి సినిమాల్లోకి వెళ్లడం అన్ని ఒక కలలా మారిపోయాయట. అలా అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది.
మోడలింగ్ తో కెరియర్ ఆరంభం..
మోడలింగ్ చేస్తున్న సమయంలో సుజీత్ సర్కారు దర్శకత్వంలో 2013లో విడుదలైన పొలిటికల్ స్పై థ్రిల్లర్ 'మద్రాస్ కేఫ్' లో అవకాశం లభించింది. ఇందులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ క్యారెక్టర్ పోషించిన జాన్ అబ్రహం భార్య రూబీ సింగ్ అనే క్యారెక్టర్ పోషించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాతే తెలుగులో అవకాశాలు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత మనం, వెంకీ మామ, తొలిప్రేమ, థాంక్యూ, సర్దార్ ఇలా వరుస చిత్రాలతో మంచి విజయాలనే సొంతం చేసుకుంది.
పవన్ కళ్యాణ్ సినిమాలో బిజీగా..
ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే.. కాస్త కథల ఎంపిక విషయంలో తడబడ్డ రాశి ఖన్నా తెలుగులో నటించిన చిత్రాలు పెద్దగా విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత తమిళ్, హిందీ సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ఒక్కో చిత్రానికి కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీగా మారిన ఈమె.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ బర్తడే సందర్భంగా ఒక స్పెషల్ ఫోటోని షూటింగ్ సెట్ నుంచి లీక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రాశి ఖన్నాకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.