• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప స్థానం పై పట్టుకు...

పుష్ప స్థానం పై పట్టుకు ఇద్దరి పంతం!

| పుష్ప 2 కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆగస్టు 15 డేట్ కి అటు ఇటు రెండు మూడు వారాలను ఇతర సినిమాలు వదిలేయడం జరిగింది.

By - Tupaki Desk
Update: 2024-06-26 07:08 GMT

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాను ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు నిన్న మొన్నటి వరకు యూనిట్‌ సభ్యులు చెబుతూ వచ్చారు. అధికారికంగా డేట్‌ ను కూడా ఇచ్చి పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. కానీ తాజాగా సినిమా విడుదల వాయిదా పడింది.

పుష్ప 2 కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆగస్టు 15 డేట్ కి అటు ఇటు రెండు మూడు వారాలను ఇతర సినిమాలు వదిలేయడం జరిగింది. కానీ పుష్ప 2 విడుదల వాయిదా పడటంతో ఇతర సినిమాలను ఆ తేదీకి తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే పుష్ప వదిలేసిన ఆ తేదీని రామ్‌, పూరిల డబుల్‌ ఇస్మార్ట్‌ ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఆగస్టు 15న తమ సినిమాను విడుదల చేయబోతున్నట్లు గా ప్రకటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. అదే తేదీకి ఎన్టీఆర్‌ బావమరిది సినిమా 'ఆయ్‌' ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ రెండు సినిమాలు విభిన్నమైన జోనర్‌ అవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాలకు పోటీ అన్నట్లుగా తమిళ్ మూవీ తంగలాన్ ను విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తంగలాన్ ను భారీ ఎత్తున విడుదల చేయడానికి ఆగస్టు 15 మంచి తేదీ అన్నట్లుగా నిర్మాతలు భావిస్తున్నారట.

తంగలాన్ తమిళ సినిమా అయినా కూడా తెలుగు లో విక్రమ్‌ కి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు పాజిటివ్‌ టాక్ వస్తే తెలుగు సినిమాల స్థాయిలో వసూళ్లు నమోదు చేసే అవకాశాలు లేకపోలేదు.

అందుకే పుష్ప వదిలి పెట్టిన ఆగస్టు 15 పై ఏ సినిమా పట్టు సాధిస్తుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు లో ఈ మధ్య కాలంలో భారీ సినిమాలు వరుసగా విడుదల అవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొనబోతుంది. మరి ఆగస్టు 15న పరిస్థితి ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • FilmIndustry 
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • DoubleIsmart 
  • Ram 
  • Puri 
  • NarneNithiin 
  • Aay 
  • Thangalaan 
  • Vikram 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS