• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2: 500 కోట్ల...

పుష్ప 2: 500 కోట్ల సునామీ.. ఇదే నెవ్వర్ బిఫోర్ రికార్డ్

| ఆ నెంబర్లకు బాలీవుడ్ రికార్డులు కూడా బ్రేక్ అవ్వడంతో ఐకాన్ స్టార్ రేంజ్ మరో లెవెల్ కు వెళ్లింది.

By - Tupaki Desk
Update: 2024-12-08 06:20 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా మరోసారి చరిత్ర సృష్టిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి భారీ రికార్డులు నమోదు చేస్తూ, దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి, భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్ల రికార్డును సొంతం చేసుకుంది. ఆ నెంబర్లకు బాలీవుడ్ రికార్డులు కూడా బ్రేక్ అవ్వడంతో ఐకాన్ స్టార్ రేంజ్ మరో లెవెల్ కు వెళ్లింది.


డిసెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు మూడో రోజుకు ముగింపు నాటికి రూ. 500 కోట్ల మార్క్‌ను చేరుకుంది. దీంతో వరకు ఎవరూ సాధించని ఘనతను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి పుష్ప 2 నిరూపించింది. ఈ విజయంతో పుష్ప 2 భారతీయ సినీ చరిత్రలో వేగవంతమైన 500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం గానే కాకుండా, తెలుగు సినిమా గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనతను సాధించింది.

ఈ సినిమా ప్రభంజనం గురించి మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ స్పందిస్తూ, "భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద చిత్రంగా పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద అగ్నిపర్వతంలా దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్‌ను వేగంగా చేరిన చిత్రంగా నిలిచింది" అని ప్రకటించారు. అల్లు అర్జున్ నటనతో పాటు, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన కథా, కథనాలకి విశేషంగా ఆదరణ లభించడంతో సినిమా విజయం మరింత ఉత్సాహాన్నిస్తుంది.

ఇది కేవలం ఒక సినిమా విజయంగా మాత్రమే కాకుండా, తెలుగు సినిమా స్థాయిని, ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పింది. తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకుల నుండి విశేష స్పందనతో ఈ సినిమా ముందుకు సాగుతోంది. ఈ రికార్డులు చూసిన పరిశ్రమవర్గాలు, ప్రేక్షకులు ఒక్క మాటలో "పుష్ప 2 నిజమైన బ్లాక్‌బస్టర్" అని చెబుతున్నారు.

మొత్తం మీద, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ మరోసారి సౌత్ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చూపించింది. పుష్ప 2 విజయంతో తెలుగు సినిమా సత్తా, బాక్సాఫీస్ పై దేనికీ తీసిపోనిదని మరోసారి నిరూపితమైంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈజీగా వెయ్యి కోట్ల మార్క్ ను అందుకుంటుందని చెప్పవచ్చు. ఆదివారం బుకింగ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక వీకెండ్ అనంతరం కూడా సినిమా ఇదే స్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

THE BIGGEST INDIAN FILM is a WILDFIRE AT THE BOX OFFICE and is SHATTERING RECORDS 🔥🔥#Pushpa2TheRule is now THE FASTEST INDIAN FILM to collect a gross of 500 CRORES WORLDWIDE ❤️‍🔥#RecordRapaRapAA #Pushpa2#WildFirePushpa #AlluArjun #Tupaki pic.twitter.com/2c8VzaOAx6

— Tupaki (@tupaki_official) December 7, 2024
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Collections 
  • Worldwidecollections 
  • Alluarjun 
  • Sukumar 
  • Mythrimoviemakers 
  • Boxoffice 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS