పుష్ప 3 కోసం ఇద్దరు యువ హీరోలా.. సెట్టయితే డబుల్ కిక్!
పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించిన 'పుష్ప 2: ది రూల్' తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ‘పుష్ప 3’పైనే ఉంది.;
పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించిన 'పుష్ప 2: ది రూల్' తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ‘పుష్ప 3’పైనే ఉంది. బన్నీ నటనతో పాటు సుకుమార్ మేకింగ్ మాస్ ఆడియెన్స్ ను ఒక రేంజ్ లో ఊపేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫ్రాంచైజీ మూడో భాగం మరో లెవెల్ కు తీసుకెళ్తుందని ఇదివరకే మేకర్స్ హింట్ ఇచ్చారు. కాగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే.. సీక్రెట్ లైన్ లీకయ్యిందంటూ సోషల్ మీడియాలో ఓ బజ్ బలంగా చక్కర్లు కొడుతోంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. పుష్ప 3లో ఈసారి డబుల్ విలనిజం ఉండనుందని చెబుతున్నారు. సుకుమార్ ఈసారి కథను మరింత డార్క్‌గా, ఇంటెన్స్‌గా రాసుకుంటున్నాడట. ఇప్పటివరకు ఫహద్ ఫాజిల్ నటించిన భన్వర్‌సింగ్ షెఖావత్ పాత్రే విలన్‌గా నిలిచినప్పటికీ, ఈసారి కథలో మరో ఇద్దరు కీలక విలన్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అది కూడా యువ హీరోలు రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముందుగానే విజయ్ దేవరకొండ పేరు వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు నాని పేరు వైరల్ గా మారింది. బన్నీ, విజయ్ మధ్య మంచి అనుబంధం ఉంది.. గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కలిసి నటించారు. ఇక స్క్రీన్‌పైనే వారిద్దరూ విరుద్ధ పాత్రల్లో తలపడితే కచ్చితంగా విజువల్ ట్రీట్ ఉంటుందని అభిమానుల అభిప్రాయం. ఇప్పటికే ‘విలనిజం’ తాలూకు ఎటిట్యూడ్‌ను ‘వి’, ‘దసరా’ సినిమాల్లో నాని బాగా చూపించాడు. అలాంటి నాని, మాస్ ఆరాధ్యుడిగా బన్నీకి ఎదురుగా వస్తే.. అది ఓ కొత్త యాంగిల్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట.
ఇక విజయ్ దేవరకొండ కూడా గతంలో ‘అర్జున్ రెడ్డి’ నుంచి తన స్టైల్ యాటిట్యూడ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ ఇద్దరు హీరోలు విలన్లుగా వస్తే మాత్రం... పుష్ప 3 రేంజ్ మామూలుగా ఉండదని టాక్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సుకుమార్, రామ్ చరణ్ తో RC17 సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ మరోవైపు త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలతో లైనప్ బిజీగా ఉంది. వీటి తర్వాతే 'పుష్ప 3' సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఇప్పటికే 2028లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న హైప్‌తో పాటు, ఈ లీక్ లైన్‌తోనే సోషల్ మీడియాలో పుష్ప 3కి సంబంధించి బలమైన అంచనాలు ఏర్పడ్డాయి. నిజంగానే విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో విలన్ పాత్రల్లో కనిపిస్తే.. అది తెలుగు సినిమాకు మరో బిగ్ లెవెల్ మూవీ అవ్వడం పక్కా. మరి ఈ బజ్ ఎంతవరకు నిజమవుతుందో, అధికారిక ప్రకటన కోసం కొంతకాలం వేచి చూడాల్సిందే.