'పుష్ప-3' పనుల్లో సుకుమార్?
'పుష్ప' ప్రాంచైజీ పాన్ ఇండియాలో ఎలాంటి విజయాలు నమోదు చేసిందో తెలిసిందే. రెండు భాగాలు ఇండియాని షేక్ చేసాయి.;

'పుష్ప' ప్రాంచైజీ పాన్ ఇండియాలో ఎలాంటి విజయాలు నమోదు చేసిందో తెలిసిందే. రెండు భాగాలు ఇండియాని షేక్ చేసాయి. రెండు కలిపి 2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పాన్ ఇండియాలో సంచలన ప్రాంచైజీగా మారింది. భారతీయ చిత్ర పరిశ్రమలో పుష్పకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించారు. రెండవ భాగంలోనే పుష్ప-3కి కూడా లీడ్స్ వదిలేసారు. కానీ కథ మాత్రం సిద్దంగా లేదు.
లీడ్స్ అంటే ఇచ్చారు కానీ ఎలా మొదలు పెట్టాలి? ఎలా ముగించాలి? అన్నది ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయాన్ని అల్లు అర్జున్- సుకుమార్ స్వయంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో పుష్ప3 ఉండదని అంతా ఓ అంచనాకి వచ్చేసారు. నాలుగైదేళ్ల పాటు బన్నీ-సుకుమార్ ఇదే ప్రాజెక్ట్ కోసం పనిచేయడంతో? వాళ్లతో పనిచేయాలనుకున్న వాళ్లకు అవకాశం రాకుండా పోయింది. అలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఈ ద్వయం కూడా లాంగ్ గ్యాప్ తీసుకునే పుష్ప3 చేయాలని భావించారు. కానీ తాజాగా సమీక రణాలు మారుతున్నట్లు కనిపిస్తుంది. సుకుమార్ 'పుష్ప 3' స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్లు సమా చారం. ఇప్పటి నుంచి మొదలు పెడితే తప్ప స్క్రిప్ట్ సిద్దం చేయడం వీలు పడదని నెమ్మదిగా కలం పట్టినట్లు తెలుస్తోంది. అసలే సుకుమార్ గందరగోళం మనిషి. స్క్రిప్ట్ ఒకే అయిన తర్వాత వాటికి సీన్స్ పరంగా రకరకాల వెర్షన్స్ రాస్తుంటారు.
వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడంలో చాలా గందరగోళానికి గురవుతుంటాడు. ఈ క్రమంలో తన రైటింగ్ టీమ్ సహకారం తీసుకుని ఫైనల్ చేస్తుంటాడు. ఇదంగా పక్కనబెడితే రామ్ చరణ్ తో తన 17వ చిత్రం కూడా డైలమాలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యలోకి సుకుమార్ దిగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. పుష్ప 3 రెయిజింగ్ కి ఇదీ ఓ కారణంగా వెలుగులోకి వస్తోంది.