గ్లామర్ తో హీటెక్కిస్తున్న గ్లోబల్ స్టార్!

ఇకపోతే ఇక్కడ తన భర్త నిక్ జోనస్ తో కలిసి దిగిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.;

Update: 2026-01-13 09:30 GMT

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడు తన నటనతోనే కాదు అందంతో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఇప్పటివరకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేదికపై తన భర్త నిక్ జోనస్ తో కలిసి సందడి చేసిన ఈమె.. తాజాగా క్రీమ్ కలర్ డ్రెస్ ధరించి అందాలు ఆరబోస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరొకసారి తన భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసిన అభిమానులు గ్లామర్ తో ఇంకెంత హీటెక్కిస్తావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.




 


ఇకపోతే ఇక్కడ తన భర్త నిక్ జోనస్ తో కలిసి దిగిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు అభిమానులు. అంతేకాదు పలు రకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.. మొత్తానికైతే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ తర్వాత ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




 


ప్రియాంక చోప్రా ప్రస్తుతం తెలుగులో చేస్తున్న చిత్రం వారణాసి. లెజెండ్రీ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ఆఫ్రికన్ అడవులలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మరోసారి మహేష్ బాబుకు తండ్రిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మందాకిని అనే పవర్ఫుల్ పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో చీర కట్టుకొని చేతిలో గన్ను పట్టుకొని యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.




 


ప్రస్తుతం నటిగా కొనసాగుతున్న ఈమె.. 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతే సినిమాలలో అవకాశాలు లభించాయి. అలా తొలిసారి 2002లో తమిళ చిత్రం తమిళన్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ స్పై అనే చిత్రం ద్వారా 2003లో హిందీ రంగ ప్రవేశం చేసింది. ఇక ఇప్పటినుంచి బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె అక్కడ అవకాశాలు కరువవడంతో హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడే పలు చిత్రాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు ఏకంగా ఒక్కో చిత్రానికి 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా ప్రియాంక చోప్రా పేరు దక్కించుకుంది.

Tags:    

Similar News